‘ఆదికేశవ్’ రిజల్ట్ త్రివిక్రమ్ తలకు చుట్టుకుంది.!

- November 25, 2023 , by Maagulf
‘ఆదికేశవ్’ రిజల్ట్ త్రివిక్రమ్ తలకు చుట్టుకుంది.!

వైష్ణవ్ తేజ్ పంజా, శ్రీలీల జంటగా వచ్చిన చిత్రం ‘ఆది కేశవ్’. రిలీజ్‌కి ముందు బజ్ బాగానే వున్నప్పటికీ, సినిమాని ఫస్ట్ డే ఫస్ట్ షోకే తేల్చేశారు.
మూస కథతో అస్సలేమాత్రం కొత్తదనం లేకుండా సాగిందన్న టాక్ తెచ్చుకుంది. ఈ మాత్రం సినిమాకి ఇంత బిల్డప్ అవసరమా.? ఆల్రెడీ గతంలో ఇలాంటి బోలెడన్ని ఫ్యాక్షనిస్ట్ సినిమాలు చూసేశాం. ఈ మాత్రానికి మళ్లీ ఇంకోసారి చూడాలా.? అన్న అభిప్రాయాలు సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్నాయ్.
ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఈ కథని వైష్ణవ్ కోసం ఓకే చేసింది మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అట. ఇలాంటి కథని త్రివిక్రమ్ ఎలా ఓకే చేశాడు.? అంటూ ఆయన్ని ఆడి పోసుకుంటున్నారు కొందరు సినీ మేథావులు.
అన్ని సినిమాలూ హిట్ అవ్వాలన్న వుద్దేశ్యంతోనే మంచి కథలుఅన్న వుద్దేశ్యంతోనే తెరకెక్కిస్తారు. కొన్నిసార్లు అవి నెగిటివ్ రిజల్ట్ ఇస్తుంటాయ్. అలాగే ‘ఆది కేశవ్’ కూడా. అంత మాత్రాన ఇంత ట్రోలింగ్ అవసరమా..? అంటూ మెగా అభిమానులు సదరు ట్రోలర్స్‌కి కౌంటర్స్ ఇస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com