పాలస్తీనియన్లకు చికిత్స అందించేందుకు సిద్ధం: కువైట్

- November 26, 2023 , by Maagulf
పాలస్తీనియన్లకు చికిత్స అందించేందుకు సిద్ధం: కువైట్

కువైట్: గాయపడిన పాలస్తీనియన్లకు చికిత్స చేయడానికి సిద్ధం కావాలని కువైట్ ఆరోగ్య మంత్రి డాక్టర్ అహ్మద్ అల్-అవధి ప్రభుత్వ వైద్య సదుపాయాలైన ఆసుపత్రులను ఆదేశించారు.  నవంబర్ 1 న జరిగిన సెషన్‌లో జాతీయ అసెంబ్లీ చేసిన సిఫారసులకు అనుగుణంగా ఆరోగ్యమంత్రి ఈ ఆదేశాలు ఇచ్చారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ  ఒక ప్రకటనలో తెలిపింది.  గాయపడిన పాలస్తీనియన్లకు చికిత్సలు నిర్వహించడానికి, కువైట్‌కు వారిని తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేసేందుకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇతర సంబంధిత ప్రభుత్వ విభాగాలతో సమన్వయం చేస్తుందని పేర్కొన్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com