జూన్ 3న 'అడవిలో లాస్ట్ బస్' విడుదల
- May 26, 2016
సైకలాజికల్ థ్రిల్లర్ మూవీస్ కి ప్రేక్షకాదరణ మెండుగా ఉంటుంది. అయితే, కాన్సెప్ట్, స్ర్కీన్ ప్లే బ్రహ్మాండంగా కుదరాలి. అలా కుదిరిన కన్నడ చిత్రం 'లాస్ట్ బస్'. ఈ చిత్రాన్ని `అడవిలో లాస్ట్ బస్` పేరుతో శ్రీ మంజునాథ మూవీ మేకర్స్ సంస్థ తెలుగులోకి విడుదల చేయనుంది. పూజా సమర్పణలో జూన్ 3న ఈ చిత్రం విడుదల కానుంది. లంబసింగి నుంచి అరకు వెళ్లే ఆఖరి బస్సులో ఏం జరిగిందనే నేపథ్యంతో తెరకెక్కిన చిత్రం ఇది. ఎస్.డి. అరవింద్ దర్శకత్వం వహించడంతో పాటు పాటలు కూడా స్వరపరిచారు. అవినాష్, నరసింహరాజు, మేఘశ్రీ, ప్రకాశ్, మానస జోషి, రాజేశ్ కీలక పాత్రల్లో నటించారు.చిత్ర విశేషాల గురించి సమర్పకురాలు పూజశ్రీ మాట్లాడుతూ ``అద్భుతమైన కాన్సెప్ట్ తో తీసిన సినిమా ఇది. తెలుగు ప్రేక్షకులకు చాలా కొత్తగా ఉంటుంది. మంచి సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ. కన్నడంలో ఈ ఏడాది సంక్రాంతికి విడుదలై, ఘన విజయం సాధించింది. మంచి వసూళ్లు రాబట్టడంతో పాటు కర్ణాటక ప్రభుత్వం నుంచి రెండు అవార్డులు కూడా వరించడం విశేషం. లంబసింగి నుంచి అరకు వెళ్లే ఆఖరి బస్సులో ఏం జరిగిందనే నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం. ఇందులో రెండు పాటలున్నాయి. తొలిసారి బీబీసీలో ఈ సినిమా పాట ప్రదర్శితమైంది. రెండు పాటలను తెలుగులో రాకేందుమౌళి వెన్నెలకంటి రాశారు. నందు తుర్లపాటి రాసిన సంభాషణలు హైలైట్ అవుతాయి. డబ్బింగ్తో పాటు అనువాద కార్యక్రమాలు పూర్తయ్యాయి. తప్పకుండా తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం ఉంది`` అని చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: అనంత అరసు, మాటలు: నందు తుర్లపాటి, పాటలు: రాకేందుమౌళి వెన్నెలకంటి, దర్శకత్వం, సంగీతం: ఎస్.డి.అరవింద్, సమర్పణ: పూజశ్రీ, నిర్మాణం: శ్రీ మంజునాథ మూవీ మేకర్స్.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







