దుబాయ్ లో సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం

- November 27, 2023 , by Maagulf
దుబాయ్ లో సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం

దుబాయ్: దుబాయ్ లోని అల్ ఘిసైస్ ప్రాంతంలో గల మాయామణి హాల్ లో కార్తీక పౌర్ణమి సందర్బంగా సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం అత్యంత వైభవోపేతంగా జరిగింది. సీతా కమ్యూనిటీ ఆధ్వర్యంలో నిర్వహింపబడ్డ ఈ కార్యక్రమం ఉదయం గణపతి పూజ తో మొదలై మధ్యాహ్నం మంగళాశాసనం తో ముగిసింది.వేదోక్త ప్రకారంగా మొదలైన ఈ కార్యక్రమం విష్ణు సహస్రనామ పారాయణ, లక్ష్మి అష్టకం, పురుష సూక్త సహిత అభిషేకం తో కొనసాగింది. ముందుగానే  రిజిస్టర్ చేసుకున్న 45 జంటలు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామి వారి అనంత కృపా కటాక్షానికి పాత్రులైయ్యారు.కన్నుల పండుగగా జరిగిన పూజ లో పాల్గొన్న జంటలు తిరుపతి లడ్డు ప్రసాదం, అన్నవరం సత్యదేవుని బంగీ ప్రసాదం అందుకున్నారు.ముకుంద్ కౌశిక్.బి అయ్యంగార్ ఆధ్వర్యంలో నిర్వహించబడ్డ ఈ కార్యక్రమం సీతా కమిటీ సభ్యులు అశోక్ కుమార్, రంగనాథ్, సి.వెంకటేశ్వరరావు, పీ.వేంకటేశ్వర రావు, సి.హెచ్.నాగరాజు, ఆర్. భరత్ ,ఊర కృష్ణ, వసుధా గుప్తా మరియు ప్రశాంత్ సహాయ సహకారాలతో అత్యంత వైభవంగా ముగిసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com