గాజాలోకి ప్రవేశించిన 10 యూఏఈ సహాయ ట్రక్కులు

- November 27, 2023 , by Maagulf
గాజాలోకి ప్రవేశించిన 10 యూఏఈ సహాయ ట్రక్కులు

దుబాయ్: మానవతా ప్రయత్నంలో భాగంగా 16,520 ఫుడ్ పార్సెల్స్ సహా మొత్తం 247.8 టన్నులతో నిండిన పది యూఏఈ సహాయ ట్రక్కులు విజయవంతంగా గాజాలోకి ప్రవేశించాయి. ఈ సవాలు సమయాల్లో గాజా స్ట్రిప్‌లోని పౌరుల బాధలను తగ్గించడం లక్ష్యంగా ఈ మిషన్, ఆపరేషన్ ‘గాలంట్ నైట్ 3’ కింద నిర్వహించినట్లు యూఏఈ వర్గాలు పేర్కొన్నాయి. ప్రెసిడెంట్ హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఆదేశాలను అమలు చేయడంలో, UAE పాలస్తీనా ప్రజలకు మద్దతు ఇవ్వడానికి తన నిబద్ధతను కొనసాగిస్తూనే ఉంటుందన్నారు. బాధితులకు సహాయం అందించడం,  పౌరుల అవసరాలను తీర్చడంలో యూఏఈ స్థాపించబడిన మానవతా దృక్పథానికి ప్రతిబింబంగా ఈ సహాయం అందజేసినట్లు పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com