కొత్త ప్రాంతాలకు దుబాయ్ మెట్రో.. తొమ్మిది కీలక ప్రాంతాలకు ప్రయోజనం

- November 27, 2023 , by Maagulf
కొత్త ప్రాంతాలకు దుబాయ్ మెట్రో.. తొమ్మిది కీలక ప్రాంతాలకు ప్రయోజనం

యూఏఈ: నవంబర్ 24న దుబాయ్ మెట్రో బ్లూ లైన్ ప్రాజెక్టుకు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. 30 కిమీ మేర కీలక ప్రాంతాల గుండా దీనిని నిర్మించనున్నారు.  ఇటీవల ప్రకటించిన దుబాయ్ మెట్రో పొడిగింపు ప్రాజెక్ట్ కోసం కేటాయించిన తొమ్మిది కీలక ప్రాంతాల్లో నివాసితులు, కార్మికులు, నిపుణులు, వ్యాపారులు మరియు విద్యార్థులు పొడిగింపును స్వాగతించారు. ప్రారంభం కోసం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు. దుబాయ్‌లోని అన్ని ప్రధాన పట్టణ కేంద్రాలు మరియు ఇతర అభివృద్ధి జోన్‌లకు కనెక్టివిటీని పెంచుతుంది. బ్లూ లైన్ మిర్డిఫ్, అల్ వార్కా, ఇంటర్నేషనల్ సిటీ 1 మరియు 2, దుబాయ్ సిలికాన్ ఒయాసిస్, అకడమిక్ సిటీ, రస్ అల్ ఖోర్ ఇండస్ట్రియల్ ఏరియా, దుబాయ్ క్రీక్ హార్బర్ మరియు దుబాయ్ ఫెస్టివల్ సిటీల గుండా వెళ్లేలా నిర్మిస్తున్నారు. అలాగే కొత్త లైన్ ప్రస్తుత రెడ్ మరియు గ్రీన్ లైన్లకు అనుసంధానం చేయనున్నారు. 2029 నాటికి బ్లూ లైన్ అందుబాటులోకి వచ్చినప్పుడు ప్రాజెక్ట్ ప్రాంతంలోని కీలకమైన రోడ్లపై రద్దీ 20 శాతం తగ్గుతుందని, ఆ ప్రాంతంలో మెట్రో ప్రయాణ సమయం 10 నుంచి 25 నిమిషాల మధ్య మాత్రమే ఉంటుందని భావిస్తున్నారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com