గాజాలోకి ప్రవేశించిన 10 యూఏఈ సహాయ ట్రక్కులు
- November 27, 2023
దుబాయ్: మానవతా ప్రయత్నంలో భాగంగా 16,520 ఫుడ్ పార్సెల్స్ సహా మొత్తం 247.8 టన్నులతో నిండిన పది యూఏఈ సహాయ ట్రక్కులు విజయవంతంగా గాజాలోకి ప్రవేశించాయి. ఈ సవాలు సమయాల్లో గాజా స్ట్రిప్‌లోని పౌరుల బాధలను తగ్గించడం లక్ష్యంగా ఈ మిషన్, ఆపరేషన్ ‘గాలంట్ నైట్ 3’ కింద నిర్వహించినట్లు యూఏఈ వర్గాలు పేర్కొన్నాయి. ప్రెసిడెంట్ హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఆదేశాలను అమలు చేయడంలో, UAE పాలస్తీనా ప్రజలకు మద్దతు ఇవ్వడానికి తన నిబద్ధతను కొనసాగిస్తూనే ఉంటుందన్నారు. బాధితులకు సహాయం అందించడం, పౌరుల అవసరాలను తీర్చడంలో యూఏఈ స్థాపించబడిన మానవతా దృక్పథానికి ప్రతిబింబంగా ఈ సహాయం అందజేసినట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- మస్కట్‌లో పార్కింగ్ సర్వే ప్రారంభం..!!
- త్వరలో ఆటోమేటిక్ వెహికల్ ఇన్ ఫెక్షన్ సెంటర్ ప్రారంభం..!!
- జిసిసి ప్రతినిధులతో అమీర్ సమావేశం..!!
- ‘శ్రావణం’ ఓనం ఉత్సవంలో గ్రాండ్ కాన్సర్ట్..!!
- కొత్త చట్టం.. గరిష్టంగా SR20,000 జరిమానా..!!
- యూఏఈ ప్రవాసిని వరించిన Dh1 మిలియన్ లాటరీ..!!
- ఫోన్‌పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!