భారతీయ విద్యార్ధుల అమెరికా వీసా నిబందనల్లో మార్పులు
- November 27, 2023
భారతీయ విద్యార్ధులకు బిగ్ అలర్ట్. ముఖ్యంగా అమెరికా వెళ్లి చదువుకోవాలనుకునే విద్యార్ధులు గమనించాల్సిన విషయమిది. అమెరికా రాయబార కార్యాలయం కొన్ని సవరణలు చేసింది.
కొత్త నిబంధనలు ప్రవేశపెట్టింది. భారతీయ విద్యార్ధులకు వీసా దరఖాస్తు ప్రక్రియలో తీసుకొచ్చిన కొత్త నిబంధనలు ఇవాళ్టి నుంచి అమల్లోకి వచ్చాయి.
ప్రతి యేటా లక్షలాదిమంది విద్యార్ధులు విద్య కోసం అమెరికాకు పయనమౌతుంటారు. అందులో అత్యధికులు భారతీయులే. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. అందుకే అమెరికన్ ఎంబసీ భారతీయ విద్యార్ధుల వీసా దరఖాస్తు ప్రక్రియలో కీలక మార్పులు చేసింది. ఈ కొత్త మార్పుల్ని ఇవాళ్టి నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. యూఎస్ రాయబార కార్యాలయం ప్రవేశపెట్టిన కొత్త నిబంధనలు ఇండియాలోని అన్ని రాయబార కార్యాలయాలకు వర్తించనున్నాయి. ఎఫ్, ఎమ్, జే వీసా ప్రోగ్రామ్స్ కింద అమెరికాలో చదువుకోవాలనుకునే విద్యార్దులు ఈ మార్పుల్ని గమనించాల్సి ఉంటుంది. ప్రొఫైల్ క్రియేషన్, వీసా అపాయింట్మెంట్ షెడ్యూల్ చేసేటప్పుడు పాస్‌పోర్ట్‌లో ఉన్న సమాచారాన్నే వినియోగించాల్సి ఉంటుంది. పాస్‌పోర్ట్ నెంబర్ తప్పైతే దరఖాస్తుల్ని అక్కడికక్కడే తిరస్కరిస్తారు. అపాయింట్మెంట్లు రద్దయిపోతాయి. వీసా రుసుము కూడా రద్దవుతుంది.
ఎఫ్, ఎమ్ వీసాలకై దరఖాస్తు చేసుకునే విద్యార్ధులు తప్పనిసరిగా స్టూడెంట్ అండ్ ఎక్స్చేంజ్ విజిటర్ ప్రోగ్రామ్ ధృవీకరించిన స్కూల్ లేదా ప్రోగ్రామ్‌లో పేర్లు నమోదు చేసుకోవాలి. జే వీసాల కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్ధులు అమెరికా విదేశాంగ శాఖ అనుమతి ఉన్న స్పాన్సర్షిప్ అవసరమౌతుంది. ఒకవేళ తప్పుడు పాస్‌పోర్ట్ నెంబర్‌తో ప్రొఫైల్ క్రియేట్ చేసుంటే సరైన నెంబరుతో కొత్త ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవాలి. ఆపాయింట్మెంట్ కోసం మళ్లీ బుక్ చేసుకోవాలి. వీసా ఫీజు మరోసారి చెల్లించాల్సి ఉంటుంది. ఇక పాత పాస్‌పోర్ట్ పోయినా లేదా చోరీకు గురైన కొత్త పాస్‌పోర్ట్ తీసుకున్నవాళ్లు, కొత్త పాస్‌పోర్ట్ కోసం రెన్యువల్ చేయించుకున్నవాళ్లు పాత పాస్‌పోర్ట్ కాపీ జత చేయాలి.
తాజా వార్తలు
- బుల్లెట్ ట్రైన్ ఇక కేవలం 2 గంటల్లో ప్రయాణం
- వక్ఫ్ బోర్డు చట్టంలోని కొన్ని నిబంధనల పై సుప్రీం కోర్టు స్టే
- దుబాయ్ లో బ్యాంక్ ఫ్రాడ్.. అంతర్జాతీయ ముఠా అరెస్టు..!!
- సెహహతి యాప్‌లో సీజనల్ ఫ్లూ వ్యాక్సిన్ బుకింగ్..!!
- కొత్త వాహనాల ఎగుమతిని నిషేధించిన ఖతార్..!!
- ఉగ్రవాద నిరోధక వ్యూహాన్ని ఆవిష్కరించిన బహ్రెయిన్..!!
- ఒమన్ లో అడ్వాన్స్డ్ ఎయిర్ మొబిలిటీ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- ఆసియా కప్ 2025: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..
- బహ్రెయిన్‌లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్‌లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!