నిద్ర దిశ కూడా గుండె పోటుకు కారణం తెలుసా.?

- November 29, 2023 , by Maagulf
నిద్ర దిశ కూడా గుండె పోటుకు కారణం తెలుసా.?

ఈ మధ్య కాలంలో గుండె పోటు మరణాలు చాలా పెరిగిపోయాయ్. మారుతున్న జీవన శైలి, ఆహార విధానం, పొల్యూషన్.. ఒత్తిడి.. ఇలా అనేక రకాల కారణాలు అధికంగా గుండె పోటు మరణాలకు దారి తీస్తున్నాయ్.

మరి, గుండె పోటును నియంత్రించడం సాధ్యం కాదా.? అంటే కొంతవరకూ కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా నియంత్రంచడం సాధ్యమే అంటున్నారు వైద్యులు.

గుండె పోటుకు ప్రధాన కారణం సరిపడినంత నిద్ర లేకపోవడమే. కనీసం 8 గంటలు రోజుకు సగటున నిద్ర వుండాలని నిపుణులు చెబుతున్నారు. అలాగే, ఉదయం పూట సూర్య రశ్మి తగిలేలా చూసుకుంటే మంచిదని సూచిస్తున్నారు.

ఉదయం లేలేత సూర్య రశ్మిలో నడక గుండె ఆరోగ్యాన్నిమెరుగు పరుస్తుంది. గుండె కండరాలు యాక్టివ్‌గా వుండేందుకు సహకరిస్తుంది. అలాగే, కుడి వైపు ఎక్కువగా పడుకునే అలవాటున్న వారిలో గుండె పోటు వచ్చే అవకాశాలు తక్కువని తాజా సర్వేలో తేలింది.

జంక్ ఫుడ్స్, అధికంగా మసాలా ఐటెమ్స్ తినే వారిలో ఈ సమస్య ఎక్కువ. వాటిని తగ్గించుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. నడకతో పాటూ. ప్రతీరోజూ చిన్నపాటి వ్యాయామాలు కూడా తప్పనిసరిగా లైఫ్ స్టైల్‌లో భాగం చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.  

ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ జీవన శైలిని మార్చుకుంటే.. గుండె పోటు ముప్పు నుంచి కాస్తయినా తప్పించుకునే అవకాశాలుంటాయ్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com