తెలంగాణ ఓటర్లకు ప్రధాని మోడీ పిలుపు ..

- November 30, 2023 , by Maagulf
తెలంగాణ ఓటర్లకు ప్రధాని మోడీ పిలుపు ..

న్యూ ఢిల్లీ: తెలంగాణ ఓటర్లకు ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు.తెలుగులో ట్వీట్ చేస్తు ప్రధాని మోదీ తెలంగాణ ఓటర్లకు కీలక సూచనలు చేశారు. రికార్డు స్థాయిలో ఓటు వేసి ప్రజాస్వామ్య పండుగను బలోపేతం చేయాలని సూచించారు. యువకులు మరీ ముఖ్యంగా మొదటిసారిగా ఓటు వేస్తున్నవారు అందరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.

మెదీ తెలుగు ట్వీట్ లో ఇలా పేర్కొన్నారు: తెలంగాణలోని నా సోదర సోదరీమణులు రికార్డు స్థాయిలో ఓటు వేసి ప్రజాస్వామ్య పండుగను బలోపేతం చేయాలని నేను పిలుపునిస్తున్నాను. యువకులు మరీ ముఖ్యంగా మొదటిసారిగా ఓటు వేస్తున్నవారు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని నేను ప్రత్యేకంగా కోరుతున్నాను.

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com