వాతావరణ సదస్సు ముసుగులో ఆయిల్ డీల్స్..ఆరోపణలను కొట్టిపారేసిన COP28 చీఫ్

- November 30, 2023 , by Maagulf
వాతావరణ సదస్సు ముసుగులో ఆయిల్ డీల్స్..ఆరోపణలను కొట్టిపారేసిన COP28 చీఫ్

యూఏఈ: విదేశీ ప్రభుత్వాలతో చమురు మరియు గ్యాస్ ఒప్పందాలను కుదుర్చుకోవడానికి COP28 హోస్ట్‌గా యూఏఈ ఉపయోగిస్తోందని ఆరోపిస్తూ ఈ వారం ప్రారంభంలో వచ్చిన ఆరోపణలను COP28 అధ్యక్షుడు డాక్టర్ సుల్తాన్ బిన్ అహ్మద్ అల్ జాబర్ తీవ్రంగా ఖండించారు. గురువారం ప్రారంభం కానున్న ఐక్యరాజ్యసమితి వాతావరణ సదస్సు సన్నాహాలను ఆయన వివరించారు. ఈ సందర్భంగా తప్పుడు ఆరోపణలను కొట్టిపారేశారు. COP28ను నిజాయితీగా, పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యూఏఈకి వ్యాపార ఒప్పందాలు లేదా వాణిజ్య సంబంధాలను ఏర్పరచుకోవడానికి COP లేదా COP ప్రెసిడెన్సీ అవసరమా అని ప్రశ్నించారు.  COP28 లేదా UN ఫ్రేమ్‌వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ (UNFCCC) పార్టీల కాన్ఫరెన్స్ 28వ సమావేశానికి హోస్ట్‌గా యూఏఈ వ్యవహారిస్తుంది. COP21 సమయంలో 2015 పారిస్ ఒప్పందం ప్రకారం.. పారిశ్రామిక పూర్వ స్థాయిలలో ఉష్ణోగ్రత పెరుగుదలను 1.5°Cకి పరిమితం చేయడానికి ప్రపంచదేశాలు శపథం చేశారు. డిసెంబర్ 12 వరకు ఎక్స్‌పో సిటీ దుబాయ్‌లో జరిగే COP28 యూఏఈ ప్రపంచానికి శుభవార్త అందించగలదని అల్ జాబర్ తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com