యూఏఈలో కొత్తగా పాలిమర్ AED 500 నోట్లు
- November 30, 2023
అబుదాబి: COP28, యూఏఈ 52వ యూనియన్ డేలను పురస్కరించుకొని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ యూఏఈ (CBUAE) పాలిమర్‌తో తయారు చేసిన కొత్త AED 500 నోటును జారీ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇది జాతీయ కరెన్సీ ప్రాజెక్ట్ లో భాగమని, విలక్షణమైన డిజైన్‌లు మరియు అధునాతన భద్రతా ప్రమాణాలను కలిగిఉంటుందని పేర్కొంది. హరిత ఆర్థిక వ్యవస్థకు ఇది ఆరంభం అని ప్రకటించింది. కొత్త AED 500 నోటు యూఏఈ సంస్కృతి, పర్యాటక ల్యాండ్‌మార్క్‌లు, ఎమిరేట్స్ స్థిరమైన అభివృద్ధిని తెలియజేస్తుందని తెలిపింది. నోటుకు ముందు వైపు ఉన్న ఎక్స్‌పో సిటీ దుబాయ్‌లోని టెర్రా సస్టైనబిలిటీ పెవిలియన్ బోల్డ్ ఆర్కిటెక్చర్ చిత్రం, దివంగత షేక్ జాయెద్ బిన్ సుల్తాన్ అల్ నహ్యాన్ నిర్దేశించిన సూత్రాలలో స్థిరమైన భవిష్యత్తు కోసం యూఏఈ నిబద్ధతకు నిదర్శనం అని పేర్కొంది. రివర్స్ సైడ్ దుబాయ్‌లోని మ్యూజియం ఆఫ్ ది ఫ్యూచర్‌ను, ఎమిరేట్స్ టవర్స్ మరియు కుడి వైపున ఉన్న బుర్జ్ ఖలీఫాను ముద్రించారు. కొత్త నోటు సాంప్రదాయ బ్యాంకు నోట్ల కంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ రెట్లు ఎక్కువ మన్నికగా ఉంటుందని తెలిపింది. నోటుకు తయారీకి ఉపయోగించిన పధార్థం తిరిగి వాడవచ్చని, పర్యావరణ ప్రభావాన్ని గణనీయంగా తగ్గిస్తుందని వెల్లడించింది. నీలిరంగు షేడ్స్‌ను కలిగి ఉన్న ఈనోటు వెనుక వైపున ఉన్న ఫ్లోరోసెంట్ బ్లూ మార్కింగ్‌లు యూఏఈ నేషన్ బ్రాండ్‌ను సూచిస్తాయి. అధునాతన ఇంటాగ్లియో ప్రింటింగ్ టెక్నిక్‌లను ఉపయోగించి కొత్త నోటును తయారు చేసినట్లు పేర్కొంది. నోటులో భద్రతా చిప్ సాంకేతికతను పొందుపరిచారు. మధ్యప్రాచ్యంలో ఈ రకమైన అతిపెద్ద ఫాయిల్ స్ట్రిప్‌ను బ్యాంకు నోట్లపై ఉపయోగించిన మొదటి దేశంగా యూఏఈ గుర్తింపు పొందింది. నకిలీని గుర్తించడానికి ఇవి దోహదపడతాయి. అంధులకు మరియు దృష్టి లోపం ఉన్న వినియోగదారులకు నోటును గుర్తించడంలో సహాయపడేందుకు బ్రెయిలీలో ప్రముఖ చిహ్నాలను చేర్చారు. కొత్త నోటు 30 నవంబర్ నుంచి చెలామణిలోకి వస్తుందని CBUAE గవర్నర్ ఖలీద్ మొహమ్మద్ బాలమా తెలిపారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







