అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ తేదీ మార్పు
- December 01, 2023
న్యూ ఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. మిజోరం అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ తేదీలో మార్పు చేసింది. డిసెంబర్ 3కు బదులుగా 4న కౌంటింగ్ జరపాలని ఈసీ నిర్ణయించింది. వివిధ వర్గాల నుంచి వచ్చిన అభ్యర్థన మేరకు ఈసీ ఈ డెసిషన్ తీసుకుంది. కాగా, మిగిలిన రాష్ట్రాల్లో(తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్) మాత్రం డిసెంబర్ 3నే ఓట్ల లెక్కింపు జరగనుంది.
మిజోరంలో 40 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరిగింది. 80శాతానికిపైగా ఓటింగ్ నమోదైంది. 8.57 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 174 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
షెడ్యూల్ ప్రకారం.. తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలతోపాటుగా మిజోరంలోనూ డిసెంబర్ 3న (ఆదివారం) ఓట్ల లెక్కింపు జరగాల్సి ఉంది. అయితే, మిజోరంలో ఆదివారం కాకుండా మరో రోజు ఓట్ల లెక్కింపు జరపాలని అక్కడి ప్రజల నుంచి పెద్ద ఎత్తున వినతులు వచ్చాయి. దీంతో, వారి వినతులను పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం ఓట్ల లెక్కింపు తేదీని డిసెంబర్ 4కు (సోమవారం) మార్పు చేసింది. కాగా, మిగిలిన నాలుగు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు తేదీలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ఇద్దరు ఇరానియన్ రివల్యూషనరీ గార్డ్ సెల్స్ అరెస్ట్: ఖతార్
- 166 మిస్సైల్స్, డ్రోన్లను ధ్వంసం చేశాం: బహ్రెయిన్
- కువైట్ పై దాడులకు తెగబడ్డ ఇరాన్..!!
- కువైట్లో సైనికుల మృతి పట్ల ఒమన్ సంతాపం..!!
- దౌత్యాధికారులకు ఇఫ్తార్ విందు ఇచ్చిన సౌదీ అరేబియా..!!
- డిస్టెన్స్ లెర్నింగ్ మార్చి 6 వరకు పొడిగించిన యూఏఈ..!!
- 1,000 కి పైగా ఇరానియన్ దాడులు: యూఏఈ
- అమెరికా కాన్సులేట్ పై డ్రోన్ అటాక్ పై దుబాయ్ క్లారిటీ..!!
- శరవేగంగా భోగాపురం, విజయవాడ ఎయిర్పోర్ట్లు.. కేంద్ర మంత్రి సమీక్ష
- 37 లక్షల మంది లబ్ధిదారులకు రూ.2,000 ప్రత్యేక నిధిని ప్రకటించిన స్టాలిన్









