మమతా బెనర్జీ శుక్రవారం పశ్చిమ్ బెంగాల్ ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణ స్వీకారం..
- May 26, 2016
తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ శుక్రవారం పశ్చిమ్ బెంగాల్ ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రతిష్ఠాత్మక రెడ్ రోడ్‌లో పెద్దఎత్తున జరగనున్న ప్రమాణ స్వీకారోత్సవంలో ఆమెతో పాటు మరో 41 మంది శాసనసభ్యులు మంత్రులుగా ప్రమాణం చేస్తారు. మాజీ క్రికెటర్ లక్ష్మీ రతన్ శుక్లా, గాయకుడు ఇంద్రనీల్ సేన్, కోల్‌కతా మేయర్ శోవన్‌తో పాటు మొత్తం 17 మందికి ఈసారి మంత్రివర్గంలో కొత్తగా అవకాశం దక్కనుంది. ప్రమాణ స్వీకారోత్సవానికి కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ, కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో, బంగ్లాదేశ్ పరిశ్రమల మంత్రి, భూటాన్ ప్రధానమంత్రి, జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ సింగ్ యాదవ్ హాజరు కానున్నారని ఆమె వివరించారు. దీనికి ప్రజలందరూ ఆహ్వానితులేనని తెలిపారు.పశ్చిమ్ బంగ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్న మమతా బెనర్జీకి బంగ్లాదేశ్ ప్రత్యేకమైన జమ్‌దానీ చీర, 20 కిలోల హిల్షా చేప, బెల్లాన్ని బహూకరించనుంది.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







