‘సలార్’ భీభత్సం.! మరో ‘కేజీఎఫ్’ అవుతుందా..
- December 02, 2023
‘కేజీఎఫ్’ అనే కన్నడ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని సంచలనాలు నమోదు చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్యాన్ ఇండియా స్థాయిలో రికార్డులు కొల్లగొట్టింది.
ఇదే డైరెక్టర్‌తో యూనివర్సల్ స్టార్ అయిన ప్రబాస్ నటిస్తున్న సినిమానే ‘సలార్’. డిశంబర్ 22న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన ట్రైలర్ ఇప్పుడు ట్రెండింగ్‌గా మారింది.
ట్రైలర్ ఆధ్యంతం ఆసక్తిగా కట్ చేశారు. ఇద్దరు ప్రాణ స్నేహితుల మధ్య చెలరేగిన గొడవనే ‘సలార్’ కథ. చాలా ఎమోషనల్‌గా ఈ సినిమాని తెరకెక్కించాడు ప్రశాంత్ నీల్.. అని ట్రైలర్ చూస్తుంటే అర్ధమవుతోంది. ఎంతో ప్రేమగా వుండే ఇద్దరు స్నేహితులు శత్రువులుగా మారితే, సమవుజ్జీలైన ఆ ఇద్దరు స్నేహితుల మధ్య శత్రుత్వం ఎంతటి బీభత్సానికి దారి తీసిందో ఈ సినిమా ద్వారా చూపించబోతున్నాడు ప్రశాంత్ నీల్.
అత్యంత భయానకమైన, భీభత్సమైన యాక్షన్ ఘట్టాలూ, విజువల్స్.. తెరపై ఆవిష్కరించినట్లు ట్రైలర్లో జస్ట్ శాంపిల్‌కి చూపించేశారు. ఇక, సినిమా ఏ స్థాయిలో రికార్డులు బద్దలు కొట్టబోతోందో చూడాలంటే, డిశంబర్ 22 వరకూ ఆగాల్సిందే. ‘సలార్’లో ప్రతినాయకుడి పాత్రలో పవర్ ఫుల్‌గా కనిపించబోతున్నాడు మలయాళ నటుడు పృద్వీ రాజ్ సుకుమారన్.
తాజా వార్తలు
- ఎన్విరాన్మెంటల్ స్ట్రీట్‌లో తాత్కాలికంగా మూసివేత..!!
- మరో మూడు దేశాలకు ఒమన్ ఎయిర్ సర్వీసులు..!!
- జా జైలు హత్య కేసులో ఇద్దరికి జీవిత ఖైదు ఖరారు..!!
- సౌదీ-ఫ్రెంచ్ చొరవపై యూరోపియన్ కౌన్సిల్ ప్రశంసలు..!!
- మిష్రెఫ్ ఫెయిర్‌గ్రౌండ్‌లో ఆకట్టుకుంటున్న ఆటో వరల్డ్ షో..!!
- అల్ బర్షా భవనంలో అగ్నిప్రమాదం.. మోహరించిన డ్రోన్లు..!!
- TDP ప్రవేశపెట్టిన తీర్మానానికి వైసీపీ మద్దతు
- ప్రపంచంలో నాలుగో అతిపెద్ద అంతిమయాత్రగా రికార్డు
- శ్రీవారి సేవకులకు VIP బ్రేక్ దర్శనం
- భారీ ఆఫర్లతో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్-2025