నాలుగు రాష్ట్రాల్లో గెలుపెవరిది..
- December 03, 2023
న్యూ ఢిల్లీ: భారత దేశవ్యాప్తంగా జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు ఈరోజు నాలుగు రాష్ట్రాల ఫలితాలు వెల్లడి కానున్నాయి. దీనికి సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ మొత్తం పూర్తి చేశారు ఎలక్షన్ కమిషన్ అధికారులు. ఐదు రాష్ట్రాల్లో నెలన్నరకు పైగా ప్రచారంలో తిరిగి అలిసిపోయిన రాజకీయ నాయకులకు నేడు ఫలితాలపై నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. అయితే ఈరోజు తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్ ఈ నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మాత్రమే వెలువడనున్నాయి. మిజోరం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సోమవారానికి వాయిదా వేసింది ఈసీ. వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలలో దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలను కీలకంగా భావిస్తున్నాయి పలు ప్రధాన రాజకీయ పార్టీలు.
మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో రెండు ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. మధ్యప్రదేశ్‌లో ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉండగా.. రాజస్తాన్, ఛత్తీస్గఢ్‌లలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. అయితే కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి దేశ వ్యాప్తంగా సరికొత్త జోష్‌ను క్యాడర్లో తీసుకొచ్చింది. దీంతో ఈ ఐదు రాష్ట్రాల్లో వాడివేడిగా ప్రచారం చేశారు ఇరు పార్టీలకు చెందిన నాయకులు. ఈ సారి రాజస్తాన్, ఛత్తీస్గఢ్‌లలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ మధ్యప్రదేశ్, తెలంగాణలో పాగా వేస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. మిజోరాంలో మాత్రం లోకల్ పార్టీలకే ఓటర్లు పట్టంగట్టినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం
- చెస్ టూర్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు!
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్‌లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్‌లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..







