వైద్యరంగంలో చరిత్రను సృష్టించిన బహ్రెయిన్!
- December 03, 2023
బహ్రెయిన్: సికిల్ సెల్ వ్యాధి మరియు రక్తమార్పిడి-ఆధారిత బీటా-తలసేమియాతో బాధపడుతున్న రోగులకు చికిత్స చేయడానికి CASGEVY (exagamglogene autotemcel) వినియోగాన్ని చేసి ప్రపంచవ్యాప్తంగా రెండవ, మధ్యప్రాచ్యంలో మొదటి దేశంగా బహ్రెయిన్ చారిత్రాత్మక మైలురాయిని సాధించింది. వెర్టెక్స్ ఫార్మాస్యూటికల్స్ మరియు CRISPR థెరప్యూటిక్స్ ద్వారా అభివృద్ధి చేయబడిన ఈ సంచలనాత్మక చికిత్స యూకే, యూఎస్, ఫ్రాన్స్, ఇటలీ మరియు జర్మనీతో సహా వివిధ దేశాలలో విజయవంతమైన క్లినికల్ ట్రయల్స్ చేశారు. ఈ నిర్ణయం బహ్రెయిన్ క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి అయిన హిస్ రాయల్ హైనెస్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా ఆదేశాలకు అనుగుణంగా వైద్య రంగంలో పరిశోధనలు చేపట్టినట్లు పేర్కొన్నారు. యూకే MHRA అధికారాన్ని అనుసరించి CASGEVY చికిత్సకు బహ్రెయిన్ ఆమోదం తెలిపింది. ఈ పరివర్తన చికిత్సను ఆమోదించిన ప్రపంచవ్యాప్తంగా రెండవ దేశంగా, ఈ ప్రాంతంలో మొదటి దేశంగా బహ్రెయిన్ నిలిచింది. నేషనల్ హెల్త్ రెగ్యులేటరీ అథారిటీ (NHRA) CASGEVY రక్తమార్పిడిపై ఆధారపడుతుందని వివరించింది. ఇందులో అర్హులైన రోగి నుండి మూలకణాలను వెలికితీయడం, మూలకణాల ఆరోగ్యకరమైన కాపీని శరీరంలోకి తిరిగి ప్రవేశపెట్టడం జరుగుతుందని, ఈ వినూత్న చికిత్స నుండి ప్రయోజనం పొందగల లక్ష్య సమూహాలను మరియు అర్హత కలిగిన రోగులను గుర్తించడానికి ప్రస్తుతం ప్రయత్నాలు జరుగుతున్నాయని బహ్రెయిన్‌లోని నేషనల్ హెల్త్ రెగ్యులేటరీ అథారిటీ సీఈఓ డాక్టర్ అహ్మద్ అలన్సరీ ఇలా పేర్కొన్నారు.
తాజా వార్తలు
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం