ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి జనం ముందుకు వచ్చిన కేసీఆర్..
- December 06, 2023
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. రెండుసార్లు బీఆర్ఎస్ కు అధికారం కట్టబెట్టిన ఓటర్లు ఈసారి మాత్రం ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. హస్తం పార్టీకి జై కొట్టారు. దీంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినట్లు అయ్యింది. రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.
కాగా, ఎన్నికల ఫలితాల తర్వాత మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తొలిసారి జనం ముందుకు వచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంటి నుంచి బయటకు వచ్చిన కేసీఆర్.. కార్యకర్తలకు, అభిమానులకు అభివాదం చేశారు. కేసీఆర్ ను చూడగానే ఒక్కసారిగా.. సీఎం కేసీఆర్ అనే నినాదాలతో హోరెత్తించారు. కేసీఆర్ ను చూసేందుకు పెద్ద సంఖ్యలో జనం వచ్చారు. కేసీఆర్ వారందరికీ అభివాదం చేశారు. కేసీఆర్ పక్కనే మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు కూడా ఉన్నారు.
ఎర్రవెల్లి గ్రామంలో తన నివాసంలో ఉన్న కేసీఆర్ ను చూసేందుకు చింతమడక (కేసీఆర్ స్వగ్రామం) నుంచి పెద్ద సంఖ్యలో జనం వచ్చారు. వారి ముందుకు కేసీఆర్ రాగానే.. వారంతా కొంత ఎమోషన్ అయ్యారు. సీఎం సీఎం.. సీఎం కేసీఆర్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఆయనపై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు.
తాజా వార్తలు
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్







