బాలయ్యతో ఊర్వశి.! భలే ఛాన్సులే.!

- December 06, 2023 , by Maagulf
బాలయ్యతో ఊర్వశి.! భలే ఛాన్సులే.!

బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతెలాకి టాలీవుడ్‌లో వరుసగా ఆఫర్లు వస్తున్నాయ్. అయితే, అవన్నీ జస్ట్ స్పెషల్ సాంగ్ ఆఫర్లే. బాబీ - మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్‌లో వచ్చిన ‘వాల్తేర్ వీరయ్య’ సినిమా కోసం ఐటెమ్ సాంగ్‌లో నటించింది ఊర్వశి రౌతెలా.
ఆ తర్వాత యంగ్ హీరో రామ్ పోతినేని సరసన ‘స్కంధ’లోనూ ఐటెం సాంగ్ చేసింది. మరిన్ని ఐటెమ్ సాంగ్స్ ఆఫర్లు వస్తున్నాయట ఊర్వశి రౌతెలాకి.
తాజాగా బాబీ డైరెక్షన్‌లో బాలయ్య సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలోనూ ఓ అదిరిపోయే మాస్ ఐటెం సాంగ్ వుందట. ఆ సాంగ్‌లో ఊర్వశి నటిస్తోందనేది తాజా సమాచారమ్.
అయితే, ఈ సినిమాలో ఊర్వశి ఓన్లీ ఐటెమ్ సాంగే కాదు, కొన్ని సీన్లలోనూ కనిపించబోతోందనీ తెలుస్తోంది. ‘వాల్తేర్ వీరయ్య’ సినిమా ప్రమోషన్లలో ఊర్వశి చాలా యాక్టివ్‌గా పాల్గొంది. అలా డైరెక్టర్ బాబీతో మంచి స్నేహం కుదిరింది ఊర్వశికి.
ఆ చనువుతోనే మళ్లీ బాలయ్య సినిమాలోనూ ఛాన్సిచ్చాడనీ.. అయితే, ఈ సారి కొంత నిడివి గల పాత్ర కూడా ఆఫర్ చేశాడనీ తెలుస్తోంది. చూడాలి మరి, ఈ ప్రచారంలో నిజమెంతో.! ఒకవేళ నిజమే అయితే, హీరోయిన్ మెటీరియల్ అనిపించుకున్న ఊర్వశి కోరిక కొంతైనా తీరినట్లవుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com