‘నా సామిరంగ’.! తగ్గేదేలే అంటోన్న కింగ్.!

- December 06, 2023 , by Maagulf
‘నా సామిరంగ’.! తగ్గేదేలే అంటోన్న కింగ్.!

నాగార్జునకు అర్జెంటుగా ఓ మంచి హిట్టు కావాలి. అది ‘నా సామిరంగ’ సినిమాతో పడాలని చూస్తున్నాడు. ఈ సినిమాని సంక్రాంతి బరిలో దించేందుకు ఆల్రెడీ సిద్ధమైపోయాడు నాగార్జున.
ఏది ఏమైనా సంక్రాంతికి ‘నా సామిరంగ’ సినిమాతో రావాలనుకుంటున్నాడు. ఓ వైపు బిగ్ బాస్ సీజన్ 7 షూటింగ్ పూర్తి చేస్తూనే, మరోవైపు సినిమా షూటింగ్ కూడా శరవేగంగా కంప్లీట్ చేసేస్తున్నాడు నాగార్జున.
లేటెస్టుగా ఈ సినిమా నుంచి త్వరలో ‘ఎత్తుకుపోవల్సిందే..’ అంటూ సాగే ఫస్ట్ సింగిల్ రిలీజ్ కాబోతోందంటూ ఓ పోస్టర్ ద్వారా ప్రకటించారు. ఈ పోస్టర్‌లో అసలు సిసలు పల్లెటూరి లుక్స్‌లో పంచె కట్టుతో వున్న ఈ ఫోటోకి మాస్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.
ఈ సినిమాలో నాగార్జున సరసన ఆసికా రంగనాధ్’ హీరోయిన్‌గా నటిస్తోంది. కళ్యాణ్ రామ్ నటించిన ‘అమిగోస్’ సినిమాలో హీరోయిన్‌గా నటించింది ఈ ముద్దుగుమ్మ.
ఈ శుక్రవారమే ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారట. ఆ తర్వాత వరుసగా ఈ సినిమా నుంచి అప్టేట్స్ వదిలేలా చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారనీ తెలుస్తోంది. బెజవాడ ప్రసన్న కుమార్ ఈ సినిమాకి అదిరిపోయే అద్భుతమైన కథ అందించారు. ఈ సరికొత్త కథతో నాగార్జున ఎలాంటి సూపర్ హిట్ అది కూడా సంక్రాంతి పోటీలో.. చూడాలి మరి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com