స్వల్ప శ్రేణి బాలిస్టిక్‌ క్షిపణి అగ్ని-1 ప్రయోగం విజయవంతం

- December 08, 2023 , by Maagulf
స్వల్ప శ్రేణి బాలిస్టిక్‌ క్షిపణి అగ్ని-1 ప్రయోగం విజయవంతం

న్యూఢిల్లీ: స్వల్ప శ్రేణి బాలిస్టిక్‌ క్షిపణి అగ్ని -1 శిక్షణా ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించినట్లు రక్షణశాఖ అధికారి ఒకరు శుక్రవారం వెల్లడించారు. ఒడిశా తీరంలోని ఎపిజె అబ్దుల్‌ కలాం ద్వీపం నుండి గురువారం ఈ ప్రయోగాన్ని నిర్వహించినట్లు తెలిపారు.

” అగ్ని 1 చాలా ఖచ్చితత్వ క్షిపణి వ్యవస్థ అని నిరూపించబడింది. వ్యూహాత్మక బలగాల కమాండ్‌ ఆధ్వర్యంలో నిర్వహించబడిన వినియోగదారు శిక్షణా ప్రయోగం, అన్ని కార్యాచరణ మరియు సాంకేతిక పారామితులను విజయవంతంగా ధృవీకరించింది” అని అధికారి తెలిపారు. రాడార్‌, టెలిమెట్రీ మరియు ఎలక్ట్రో ఆప్టికల్‌ సిస్టమ్‌లతో సహా అనేక ట్రాకింగ్‌ సిస్టమ్‌ల ద్వారా పొందిన డేటాను విశ్లేషించి క్షిపణి పనితీరును నిర్థారించామని అన్నారు.

ఇదే ప్రాంతం నుండి చివరి సారిగా జూన్‌ 1న క్షిపణిని ప్రయోగించారు. గతేడాది అక్టోబర్‌లో ఒడిశా తీరం నుండి కొత్తతరం బాలిస్టిక్‌ క్షిపణుల అగ్ని ప్రైమ్‌ ను భారత్‌ విజయవంతంగా ప్రయోగించింది. అగ్ని సిరీస్‌ క్షిపణులు భారతదేశం యొక్క అణు ప్రయోగాలలో  ప్రధానమైనవి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com