దుబాయ్ లో ప్రపంచంలోనే ఎత్తైన రెసిడెన్షియల్ క్లాక్ టవర్
- December 08, 2023
యూఏఈ : దుబాయ్ తన మొదటి రెసిడెన్షియల్ క్లాక్ టవర్‌ను నిర్మించబోతుంది. ఇది ప్రపంచంలోనే ఎత్తైన రెసిడెన్షియల్ క్లాక్ టవర్‌గా గుర్తింపు పొందనుంది. ఈ మేరకు టవర్ డెవలపర్లు గురువారం ప్రకటించారు. యూఏఈ ప్రీమియం రియల్ ఎస్టేట్ డెవలపర్ లండన్ గేట్, దుబాయ్‌లోని స్విస్ లగ్జరీ వాచ్ తయారీదారు ఫ్రాంక్ ముల్లర్ సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్ ను రూపొందిస్తున్నాయి. దుబాయ్ మెరీనాలో 450మీ ఎత్తులో ఉన్న లండన్ గేట్ ఎత్తైన రెసిడెన్షియల్ టవర్‌గా దాని ముద్ర వేయనుందని, ఈ బ్రాండెడ్ రెసిడెన్షియల్ టవర్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన నివాస క్లాక్ టవర్ అని లండన్ గేట్ సీఈఓ ఎమాన్ తాహా, ఫ్రాంక్ ముల్లర్ మేనేజింగ్ డైరెక్టర్ ఎరోల్ ప్రకటించారు. ఈ మేరకు రెండు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందంపై సంతకం చేశారు. కంపెనీ వెబ్‌సైట్ ప్రకారం.. ఈ టవర్‌కు ఏటర్నిటాస్ అని పేరు పెట్టారు. 36 కాంప్లికేషన్‌లు మరియు 1,483 కాంపోనెంట్‌లతో ఇది ప్రపంచంలోనే అత్యంత సంక్లిష్టమైన వాచ్ టవర్ గా గుర్తింపు పొందనుంది. లగ్జరీ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ జనవరి 2024లో అధికారికంగా ఆవిష్కరించబడుతుంది. నివాసితులు 2026 నాటికి హ్యాండ్‌ఓవర్‌ని ఆశించవచ్చని డెవలపర్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష