3 సెకన్లలో భయంకరమైన రోడ్డు ప్రమాదం..వీడియో
- December 09, 2023
యూఏఈ: మూడు సెకన్లలోపే బహుళ ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించి, అబుదాబిలో ఒక డ్రైవర్ ఘోర ప్రమాదానికి కారణమయ్యాడు. ఈ వీడియోను అబుదాబి పోలీసులు శుక్రవారం షేర్ చేసారు. ఆ క్లిప్‌లో అనేక ఉల్లంఘనలు కనిపించినప్పటికీ, అపసవ్యంగా డ్రైవింగ్ చేయడం క్రాష్‌కు ప్రధాన కారణమని అబుదాబి పోలీసులు తెలిపారు. "డ్రైవర్ రోడ్డుపై దృష్టి పెట్టలేదు. ఇతర విషయాలలో నిమగ్నమై ఉన్నట్లు అనిపించింది" అని అధికార వర్గాలు తెలిపాయి. ఇందులో ఒక ట్రాఫిక్ నేరానికి 800 దిర్హామ్ జరిమానా, నాలుగు బ్లాక్ పాయింట్లు విధించినట్లు పేర్కొన్నారు. అలాగే సిగ్నల్ జంప్ కు 1,000 దిర్హామ్ జరిమానా, 12 బ్లాక్ పాయింట్లు మరియు 30 రోజుల వాహన జప్తుతో వచ్చే మరొక ఉల్లంఘన అని పేర్కొన్నారు. అదే విధంగా జప్తు చేసిన ఆ కారును విడుదల చేయడానికి, అబుదాబి ట్రాఫిక్ నిబంధనల ప్రకారం డ్రైవర్ 50,000 దిర్హామ్‌లు పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. మూడు నెలల్లోపు యజమాని జరిమానా చెల్లించకపోతే, వాహనాన్ని వేలం వేస్తారని తెలిపారు. డ్రైవర్లందరూ తమ దృష్టిని ఎల్లప్పుడూ రోడ్డుపైనే ఉంచాలని, పాదచారులు మరియు రహదారి సంకేతాలపై శ్రద్ధ వహించాలని అబుదాబి పోలీసులు కోరారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







