బుర్ర ఉపయోగించి తాళం వేసిన బస్సులోంచి బైటపడ్డ బాలుడు
- May 27, 2016
మస్కట్ : ఒక పదేళ్ళ బాలుడు తన తెలివితేటలను ఉపయోగించడమే కాక ధైర్యం చూపి తాళం వేసిన ఒక పాఠశాల బస్సులోంచి క్షేమంగా బైటపడ్డ వైనం బుధవారం ఉదయం వెలుగు చూసింది. సేకరించిన వివరాల ప్రకారం భారతీయ పాఠశాల విద్యార్థి పాఠశాలకు చెందిన బస్సులో కాసేపు కునుకు తీసాడుఅతను నిద్రలేచే సమయానికి సహచర విద్యార్ధులందరూ వెళ్ళిపోయారు.బస్సు సైతం నిలిపి వెలుపలకు వచ్చే తలుపు తాళం వేసి ఉంది. అందరు విద్యార్థులు దిగేరా లేదా అని డ్రైవర్ తనిఖీ చేసుకోకుండా బస్సు తలపునకు తాళం వేసి అక్కడనుంచి వెళ్ళిపోయాడు.
" నా పెద్ద కుమారుడుతో పాటు పది మంది విద్యార్ధులు ఉదయం సుమారు 5.50 సమయంలో మినీబస్సు ఎక్కిన సీనియర్ పాఠశాల భవనం వద్ద మొదటి వెలుగు వచ్చేలోపు అక్కడ ఉంటారని చెప్పాడు. " తన సీటులో నిద్ర పోతున్న నా కుమారుడిని బస్సు డ్రైవర్ గమనించినట్లు లేదని విద్యార్ధి యొక్క తండ్రి పేర్కొన్నారు
విద్యార్ధి తండ్రి తెలిపిన వివరాల ప్రకారం "నా కుమారుడు సహాయం కోసం ఎంతో అరిచాడు. ఎవరి వద్ద నుంచి ప్రతిస్పందన రాలేదు. దాంతో అతను బస్సు కిటికీ తెరిచి వెంటనే వాహనం మీదనుంచి దూకి తనను తాను రక్షించుకొన్నాడు. "విద్యార్ధి పట్ల ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన బస్సు డ్రైవర్ పై పాఠశాల అధికారులకు ఫిర్యాదు దాఖలు చేస్తున్నట్లు తెలిపాడు.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్‌కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్‌ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్‌లో ఉద్యోగాలు..
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు









