మూడో టీ20 మ్యాచులో ఇంగ్లాండ్ పై భారత్ విజయం
- December 11, 2023
ముంబై: మొదటి రెండు టీ20 మ్యాచుల్లో ఓడి సిరీస్ చేజార్చుకున్న టీమ్ఇండియా ఆఖరి నామమాత్రమైన మూడో టీ20 మ్యాచులో గెలిచి పరువు దక్కించుకుంది. 127 పరుగుల లక్ష్యాన్ని భారత మహిళల జట్టు 19 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. భారత బ్యాటర్లలో ఓపెనర్ స్మృతి మంధాన (48; 48 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు), జెమిమా రోడ్రిగ్స్ (29; 33 బంతుల్లో 4 ఫోర్లు) రాణించారు. ఇంగ్లాండ్ బౌలర్లలో ఫ్రెయా కెంప్, సోఫీ ఎక్లెస్టోనెప్ లు చెరో రెండు వికెట్లు తీశారు. షార్లెట్ డీన్ ఓ వికెట్ పడగొట్టింది.
అంతకముందు మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 126 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో హెథర్‌నైట్ (52; 42 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్ సెంచరీ చేసింది. అమీ జోన్స్ (25; 21 బంతుల్లో 3 ఫోర్లు), షార్లెట్ డీన్ (16 నాటౌట్) రాణించారు. సోఫీ డంక్లీ 11, ఆలిస్ క్యాప్సే 7 పరుగులు చేయగా మైయా బౌచియర్, డేనియల్ గిబ్సన్, ఫ్రెయా కెంప్ లు డకౌట్లు అయ్యారు. భారత బౌలర్లో శ్రేయాంక పాటిల్, సైకా ఇషాక్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. రేణుకా సింగ్, అమన్‌జ్యోత్ సింగ్ లు చెరో రెండు వికెట్లు తీశారు.
ఈ మ్యాచ్‌లో భారత జట్టు విజయం సాధించినప్పటికీ మొదటి రెండు టీ20ల్లో ఓడిపోవడంతో 1-2 తేడాతో సిరీస్ కోల్పోయింది. ఇక ఇరు జట్ల ఏకైక టెస్టు మ్యాచ్ డిసెంబర్ 14న ముంబైలో జరగనుంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







