యూఏఈలో కేరళ క్లీనర్‌కు Dh100,000 అవార్డు

- December 11, 2023 , by Maagulf
యూఏఈలో కేరళ క్లీనర్‌కు Dh100,000 అవార్డు

యూఏఈ: ఎమిరేట్స్ లేబర్ మార్కెట్ అవార్డ్ విశిష్ట వర్క్‌ఫోర్స్ - ఇతర ప్రొఫెషనల్ లెవెల్స్ విభాగంలో అవార్డు అందకున్నారు కేరళకు చెందిన పమీలా కృష్ణన్.   అవార్డు అందుకోవడాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నట్లు, ఇంకా షాక్‌లో ఉన్నట్లు 51 ఏళ్ల పమీలా సంతోషం వ్యక్తం చేశారు. నవంబర్ 23న ఇతర విజేతలతో పాటు ట్రోఫీ మరియు సర్టిఫికేట్ అందించారు. "నేను కెనడియన్ మెడికల్ సెంటర్ (CMC)లో చాలా అవార్డులను గెలుచుకున్నాను. కానీ నేను వేరే చోట నుండి పొందడం ఇదే మొదటిసారి." అని కేరళలోని పాలక్కాడ్ జిల్లాకు చెందిన పమీలా తెలిపారు. ఇటీవల జరిగిన ప్రత్యేక అవార్డుల వేడుకలో 100,000 దిర్హామ్‌ల టోకెన్ చెక్కును ఆమె అందుకున్నారు. ఆమె డెల్మా స్ట్రీట్‌లోని ఈ బ్రంచ్ (CMC)లో 13 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు.   కాగా, తాను చేయగలిగినంత కాలం పని చేస్తానని, ఉద్యోగం వదిలే ఆలోచన లేదని పేర్కొన్నారు. "నేను నా రుణాన్ని చెల్లించడానికి నిధులను ఉపయోగిస్తాను.నా జీతం నుండి పొదుపు చేయడం ప్రారంభిస్తాను" అని ఆమె తెలిపారు. 100,000 రివార్డ్‌తో పాటు, పమీలాకు జీవిత బీమా పాలసీ, షాపింగ్ కార్డ్, ఫాజా కార్డ్ (డిస్కౌంట్ కార్డ్), ఒక దిర్హాం 5 బంగారు నాణెం మరియు ఫైవ్ స్టార్ హోటల్‌లో రెండు రాత్రులు బస చేయడం వంటివి అందించబడ్డాయి.      

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com