కెనడాలో కొత్త స్టూడెంట్ వీసా రూల్స్: పేరెంట్స్ పై అదనపు ఆర్థిక భారం!

- December 12, 2023 , by Maagulf
కెనడాలో కొత్త స్టూడెంట్ వీసా రూల్స్: పేరెంట్స్ పై అదనపు ఆర్థిక భారం!

యూఏఈ: కెనడాలో పెద్ద చదువులు అంతర్జాతీయ విద్యార్థులకు ఖరీదైనదిగా మారుతోంది. కెనడా ఇమ్మిగ్రేషన్ మంత్రి డిసెంబర్ 7న ఉన్నత విద్య కోసం కెనడాకు వెళ్లాలనుకునే విద్యార్థుల కోసం కొత్త రూల్స్ ను ప్రకటించారు. జనవరి 1, 2024 నుండి స్టడీ పర్మిట్ దరఖాస్తుదారులకు జీవన వ్యయ ఆర్థిక అవసరాలు పెంచబడతాయని, తద్వారా అంతర్జాతీయ విద్యార్థులు కెనడాలో జీవితానికి ఆర్థికంగా సిద్ధమవుతారని ఇమ్మిగ్రేషన్, శరణార్థులు మరియు పౌరసత్వ శాఖ (IRCC) మంత్రి మార్క్ మిల్లెర్ ప్రకటించారు. వచ్చే సంవత్సరం నుండి విద్యార్థులు ప్రయాణం, ట్యూషన్ కోసం చెల్లించడంతో పాటు రెండు దశాబ్దాలుగా (2000ల ప్రారంభంలో) ఉన్న $10,000 అవసరానికి బదులుగా $20,635కి యాక్సెస్ ఉందని చూపించవలసి ఉంటుంది.   అంతర్జాతీయ విద్య సంవత్సరానికి $22 బిలియన్ల కంటే ఎక్కువ ఆర్థిక కార్యకలాపాలను కలిగి ఉంది. 2022/23కి సంబంధించిన అధికారిక గణాంకాలు ఇంకా వెలువడనప్పటికీ, 2019-2021 నుండి యూఏఈ నుండి కెనడాకు వెళ్ళే విద్యార్థుల సంఖ్యలో స్థిరమైన పెరుగుదలను నమోదు అవుతుందని యూఏఈలోని స్టూడెంట్ మొబిలిటీ ప్లాట్‌ఫారమ్ అయిన UniHawk అడ్మిషన్స్ డైరెక్టర్ రష్మీ మీనన్ తెలిపారు. సగటున, యూఏఈ నుండి ప్రతి సంవత్సరం 1,400 మంది విద్యార్థులు కెనడాకు వెళుతున్నారని, ఈ సంఖ్య ఏటా పెరుగుతోందన్నారు. "కొత్త విధానం అనేక మంది తల్లిదండ్రుల ప్రణాళికలకు భంగం కలిగించే అవకాశం ఉంది. కానీ, విద్య నాణ్యతకు మాత్రమే ప్రాధాన్యతనిచ్చే కుటుంబాలకు ఈ నిర్ణయం పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు." అని పేర్కొన్నారు.  IRCC డేటా ప్రకారం.. జనవరి నుండి జూన్ 2023 వరకు కెనడాలో 280,000 కంటే ఎక్కువ కొత్త స్టడీ వీసాలను జారీ చేశారు. ఇది 2022లో ఇదే కాలంతో పోలిస్తే 77% అధికం కావడం గమనార్హం. 2022లో 184 దేశాల నుండి రికార్డు స్థాయిలో 551,405 మంది అంతర్జాతీయ విద్యార్థులు కెనడాకు వెళ్లారు. 2022 చివరి నాటికి 807,750 అంతర్జాతీయ విద్యార్థులు చెల్లుబాటు అయ్యే కెనడియన్ స్టడీ పర్మిట్‌లను కలిగి ఉన్నారు. ఈ సంవత్సరం పూర్తయ్యే వరకు స్టడీ పర్మిట్‌ల సంఖ్య కొత్త రికార్డును తాకుతుందని భావిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com