గ్రీన్ హైడ్రోజన్: నెదర్లాండ్స్ – ఒమన్ మధ్య కీలక ఒప్పందం!
- December 12, 2023
మస్కట్: గ్రీన్ హైడ్రోజన్ రంగంలో ఒమన్ సుల్తానేట్, నెదర్లాండ్స్ కంపెనీల మధ్య కీలక ఒప్పందాలు కుదరనున్నాయి. డచ్ మరియు ఒమానీ కంపెనీల మధ్య సహకారం, నాలెడ్జ్ షేరింగ్ భాగస్వామ్యాన్ని సులభతరం చేసే లక్ష్యంతో వివిధ ఈవెంట్‌లను నిర్వహిస్తున్నట్లు ఒమన్ లోని నెదర్లాండ్స్ రాయబారి స్టెల్లా క్లోత్ తెలిపారు. డిసెంబర్ 12న గ్లోబల్ మరియు యూరోపియన్ గ్లోబల్ హైడ్రోజన్ ట్రేడ్ ఎన్విరాన్మెంట్-ఒమన్ పాత్ర అనే అంశంపై ఎనర్జీ మజ్లిస్ ప్రత్యేక ఎడిషన్ జరుగుతుందని పేర్కొన్నారు. డిసెంబర్ 12 సాయంత్రం క్రౌన్ ప్లాజా OCECలో డచ్ మరియు ఒమానీ వ్యాపార సంఘం కోసం నెట్‌వర్కింగ్ రిసెప్షన్ నిర్వహించబడుతుందన్నారు. గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్‌లో "పార్ట్‌నర్స్ ఇన్ ఇంటర్నేషనల్ బిజినెస్" (PiB) అని పిలువబడే వ్యూహాత్మక హైడ్రోజన్ కన్సార్టియం నుండి డచ్ వ్యాపారాలు పాల్గొంటారు. ఈ PiB గల్ఫ్ ప్రాంతం, ప్రత్యేకంగా ఒమన్‌కు భవిష్యత్తు పెట్టుబడులను అన్వేషించడానికి దృష్టి సారిస్తుంది. దేశంలో ఈ కన్సార్టియం మొత్తం హైడ్రోజన్ ఉత్పత్తి, వాడుకను ప్రొత్సహించే మార్గాలపై పనిచేస్తాయి. హైడ్రోజన్ దిగుమతి-ఎగుమతి కారిడార్ల అభివృద్ధి మరియు సాంకేతిక అభివృద్ధి, ప్రమాణాలు మరియు నియంత్రణ వంటి హైడ్రోజన్ మార్కెట్‌ను సృష్టించేందుకు ఈ కంపెనీలు దోహదం చేస్తాయని స్టెల్లా క్లోత్ వివరించారు.
తాజా వార్తలు
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'
- ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీ గానప్రస్థానానికి 60 ఏళ్లు
- గుంటూరులో NATS ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు
- సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్‌లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్‌లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!







