కారుతో ఢీకొట్టడం ద్వారా హత్య యత్నం.. ఇద్దరు సౌదీ పౌరులపై విచారణ
- December 12, 2023
రియాద్: ఉద్దేశపూర్వకంగా కారుతో ఢీకొట్టి ఒక వ్యక్తిని హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు సౌదీ పౌరుల కేసును సౌదీ పబ్లిక్ ప్రాసిక్యూషన్ విచారించింది. పబ్లిక్ ప్రాసిక్యూషన్ విచారణలో ఇద్దరు నిందితులు ప్రజా భద్రతకు హాని కలిగించే విధంగా అధిక వేగంతో డ్రైవింగ్ చేస్తున్నారని, రెండు వాహనాల డ్రైవర్లు తమ మధ్య ఉన్న మునుపటి వివాదాలతో.. ఒకరికి ప్రమాదం జరగాలనే ఉద్దేశ్యంతో ఒకరినొకరు ఢీకొట్టుకోవాలని నిర్ణయించుకున్నారని నివేదికలో అధికారులు తెలిపారు. కానీ, రెండు వాహనాల్లో ఒకటి దారి నుంచి తప్పుకుని విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది. దీంతో ప్రయాణికుల్లో ఒకరు మృతి చెందగా, మరికొందరికి గాయాలయ్యాయి. ఇద్దరు ముద్దాయిలను అరెస్టు చేశారు. వారికి వ్యతిరేకంగా సమర్థ న్యాయస్థానంలో క్రిమినల్ వ్యాజ్యం దాఖలు చేశారు. వారికి చట్టంలో సూచించిన గరిష్ట జరిమానాలు విధించాలని కోర్టును కోరింది. ప్రయాణీకుల భద్రత కోసం ట్రాఫిక్ నిబంధనలను పాటించడం, వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలని పబ్లిక్ ప్రాసిక్యూషన్ సూచించింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







