సిఎం రేవంత్ రెడ్డి సెక్రటరీగా ఐపీఎస్ అధికారి షానవాజ్ ఖాసిం
- December 12, 2023
హైదరాబాద్: తెలంగాణలో సీనియర్ ఐపీఎస్ అధికారుల బదిలీలు కొనసాగుతున్నాయి. ఈరోజు ఇప్పటికే జంట నగరాల పరిధిలోని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లను ప్రభుత్వం మార్చింది. తాజాగా మరో మార్పు చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెక్రటరీగా ఐపీఎస్ అధికారి షానవాజ్ ఖాసింను నియమించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ప్రస్తుతం షానవాజ్ ఖాసిం హైదరాబాద్ రేంజ్ ఐజీగా ఉన్నారు.
మరోవైపు హైదరాబాద్ సీపీగా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి, సైబరాబద్ సీపీగా అవినాశ్ మహంతి, రాచకొండ సీపీగా సుధీర్ బాబు నియమితులయ్యారు. సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర, రాచకొండ సీపీ చౌహాన్ లను డీజీపీకి అటాచ్ చేశారు. వీరికి ఇంకా పోస్టింగ్ లు ఇవ్వలేదు. హైదరాబాద్ సీపీగా ఉన్న సందీప్ శాండిల్యను నార్కోటిక్స్ వింగ్ డైరెక్టర్ గా బదిలీ చేశారు.
తాజా వార్తలు
- దుబాయ్లో బహ్రెయిన్ ప్రయాణికులకు అరుదైన స్వాగతం..!!
- హ్యాకింగ్, ఆర్థిక మోసాల దారితీసే నకిలీ QR కోడ్లు..!!
- కువైట్ లో పాదచారుల భద్రతకు ప్రతిపాదనలు..!!
- ఖతార్ లోఆరోగ్య కేంద్రాల పనివేళలల్లో మార్పులు..!!
- సౌదీలో కార్మికుల పై ప్రవాస రుసుము రద్దు..!!
- ఒమన్, భారత్ మధ్య కీలక అవగాహన ఒప్పందాలు..!!
- ఐఫోన్ ఎగుమతుల్లో చరిత్ర సృష్టించిన భారత్
- మస్కట్ చేరుకున్న ప్రధాని మోదీ
- సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లపై కేంద్ర ప్రభుత్వం కొరడా
- చరిత్రలో నిలిచేలా TTD నిర్ణయాలు..!







