ప్రభుత్వ కార్యాలయాలను వైజాగ్‌కు తరలించడం లేదు: ఏపీ ప్రభుత్వం
- December 12, 2023
అమరావతి: వైజాగ్ కు ప్రభుత్వ కార్యాలయాలను తరలిస్తూ ఏపీ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ రైతు పరిరక్షణ సమితి నేతలు దాఖలు చేసిన పిటిషన్స్ పై హైకోర్టులో విచారణ జరిగింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. రాజధాని కార్యాలయాలను విశాఖకు ప్రస్తుతం తరలించడం లేదని తెలిపింది. కార్యాలయాలు తరలిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారం అపోహ మాత్రమే అని హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో స్పష్టం చేసింది రాష్ట్ర ప్రభుత్వం.
ఈ పిటీషన్ ను త్రిసభ్య ధర్మాసనం ముందుకు పంపాలని రిజిస్ట్రీలో అప్లికేషన్ ఇచ్చినట్లు ప్రభుత్వ న్యాయవాది పేర్కొన్నారు. కేసు విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేయాలని కోరారు. కార్యాలయాల తరలింపుపై ప్రభుత్వం నుంచి స్పష్టత ఇవ్వాలని నిన్న హైకోర్టు న్యాయమూర్తి ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో కార్యాలయాలను తరలించడం లేదని హైకోర్టుకు సమాచారం ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. అనంతరం కేసు విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష