మంచు మనోజ్ - నాని కాంబో.! ఇది విన్నారా.?
- December 13, 2023
అదేంటీ.! మంచు మనోజ్ ఈ మధ్య సినిమాలే చేయడం లేదుగా.! నానితో కలిసి సినిమా చేస్తున్నాడా.? అని ఆశ్చర్యపోతున్నారా.? ఆగండాగండి.! ఈ కాంబినేషన్ సెట్ అయ్యింది సినిమా కోసం కాదండోయ్. ఓ టాక్ షో కోసం.
బాలయ్య హోస్ట్‌గా ఆహా ఓటీటీలో ‘అన్‌స్టాపబుల్’ షో టెలికాస్ట్ అవుతున్నట్లే.. మంచు మనోజ్ హోస్ట్‌గా ఓ టాక్ షో స్టార్ట్ కానుంది.
అదే ‘ఉస్తాద్ ర్యాప్ ఆడిద్దాం’. ఇదో సెలబ్రిటీ టాక్ షో. ఈ టాక్ షోలో సెలబ్రిటీలు ఓ అభిమాని కోసం గేమ్ ఆడతారు. అలా గేమ్ విన్ అయితే, 50 లక్షలు ప్రైజ్ మనీ పొందుతారు. అలా పొందిన ప్రైజ్ మనీ మొత్తాన్నీ ఆ అభిమానికే ఇచ్చేస్తారు.
అలా ఈ టాక్ షో ఫస్ట్ సెలబ్రిటీగా నాని హాజరయ్యారు. అసలే ‘హాయ్ నాన్న’ హిట్ కొట్టి మంచి హుషారు మీదున్నాడు నాని. మంచు మనోజ్‌తో కలిసి, ఈ టాక్ షోలో నాని చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. అయితే, ఈటీవీ విన్ అనే ఓటీటీ చానెల్లో మాత్రమే ఈ టాక్ షో రన్ అవుతుంది.
తాజా వార్తలు
- చికాగోలో ఘనంగా చలనచిత్ర సంగీత కచేరీ
- సైనిక సిబ్బంది పై దాడి..ఇద్దరు వ్యక్తులు అరెస్ట్..!!
- మహిళా సాధికారత..ఉమెన్ ఇన్స్పైర్ సమ్మిట్..!!
- Dh100,000 చొప్పున గెలిచిన నలుగురు భారతీయులు..!!
- మస్కట్‌లో ఖైదీల ఉత్పత్తుల ప్రదర్శన పై ప్రశంసలు..!!
- ఖతార్‌లో విటమిన్ డి లోపం విస్తృతంగా ఉంది:స్టడీ
- ప్రభుత్వ AI ఇండెక్స్..సౌదీ అరేబియా నెంబర్ వన్..!!
- స్మార్ట్‌ఫోన్ యూజర్స్ ను హెచ్చరించిన కేంద్ర ప్రభుత్వం
- యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలి: గవర్నర్ హరిబాబు
- పలు దేశాల్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ నిషేధం







