నా సామిరంగా.! గ్లింప్స్ అదిరిందయ్యా.!
- December 15, 2023
అక్కినేని నాగార్జున తాజా చిత్రం ‘నా సామిరంగా’. ఇంతవరకూ ఈ సినిమాకి సంబంధించి విడుదల చేసిన పోస్టర్లన్నీ ఓ మాదిరిగా వున్నాయ్. హీరో నాగార్జున పాత్రకు సంబంధించిన మాస్ లుక్స్‌తో కూడిన పోస్టర్లవి.
తాజాగా ఓ గ్లింప్స్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. సినిమా స్వరూపమే మారిపోయింది ఈ గ్లింప్స్‌తో. ఈ సినిమాలో అల్లరి నరేష్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడన్న సంగతి తెలిసిందే.
అయితే, తాజా గ్లింప్స్‌లో ఆ విషయం ప్రూవ్ అయ్యేలా అల్లరోడి క్యారెక్టర్‌ని రివీల్ చేశారు. ‘చేసేయ్.. చేసెయ్.. లేదంటే మాటొచ్చేద్ది.. మాటొచ్చేద్ది..’ అంటూ ఓ డైలాగ్ నరేష్ నోటివెంట పలికించారు. ఓ చిన్న డాన్స్ స్టెప్.. రెండు సీన్లు..’ రెస్పాన్స్ మాత్రం హ్యూజ్ రేంజ్.!
తెరపై నరేష్‌తో పాటూ, నాగార్జున కూడా కనిపిస్తున్నాడు. కానీ, నరేష్ సినిమాలో నాగార్జున నటిస్తున్నాడా.? అనే ఫీల్ కలిగేలా వుంది గ్లింప్స్.
ఇద్దరూ కలిసి ఆనందంగా చిందేయడం.. నరేష్ సైకిల్ తొక్కుతుంటే.. వెనకాల నాగార్జున కూర్చోవడం.. చాలా ఆహ్లాదంగా కనిపిస్తుంది. ఈ గ్లింప్స్‌తో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయ్.
సంక్రాంతి రేస్‌లో ఈ సినిమా నిలవబోతోంది. మరి, నాగార్జునకి హిట్ ఇస్తుందా.? ఈ గ్లింప్స్‌తో ఓ అంచనాకి రావోచ్చులే మరి.
తాజా వార్తలు
- తొమ్మిది సోషల్ మీడియా ఖాతాల పై చర్యలు..!!
- యూఏఈ లాటరీ కొత్త వీక్లీ ఫార్మాట్ కింద మొదటి లక్కీ డే ఫలితాలు..!!
- మార్బర్గ్ వైరస్ వ్యాప్తి పై సౌదీ ఎంబసీ హెచ్చరిక..!!
- ఒమన్ లో వింటర్ పర్యాటక ప్రమోషన్ ప్రారంభం..!!
- కువైట్ లో డ్రగ్స్ డంప్ బస్ట్..భారీగా డ్రగ్స్ సీజ్..!!
- పలు దేశాధినేతలతో అమీర్ సమావేశం..!!
- సీఎం చంద్రబాబు–నజీర్: పాలన అంశాలపై టాప్ లెవల్ మీటింగ్
- ఉగ్రవాదుల చెరలో తెలంగాణ యువకుడు
- ఫ్లైట్ టికెట్ ధరల పెంపు పై కేంద్రం సీరియస్..
- అత్తలూరి విజయ లక్ష్మి సాహితీ స్వర్ణోత్సవం సందడి







