భారత్ లో పర్యటిస్తున్న ఒమన్ సుల్తాన్
- December 16, 2023
న్యూఢిల్లీ: సుల్తాన్ హైతం బిన్ తారిక్ తన తొలి భారత పర్యటన కోసం న్యూఢిల్లీ విమానాశ్రయంలో అడుగుపెట్టారు. ఆయనకు భారత విదేశాంగ మరియు పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి (MoS) వి మురళీధరన్ స్వాగతం పలికారు. మురళీధరన్ అక్టోబర్ 18 నుండి 19 వరకు ఒమన్ సుల్తానేట్‌లో అధికారిక పర్యటన చేశారు. "ఒమన్ హిజ్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ భారతదేశానికి తన మొదటి రాష్ట్ర పర్యటన సందర్భంగా న్యూ ఢిల్లీలో అడుగుపెట్టారు. విమానాశ్రయంలో మురళీధరన్ స్వాగతం పలికారు. ఈ పర్యటన భారతదేశం - ఒమన్ మధ్య దీర్ఘకాల స్నేహం, సహకారాన్ని మరింత బలోపేతం చేస్తుంది." అని MEA ప్రతినిధి అరిందమ్ బాగ్చి ఎక్స్(ట్విటర్) లో పోస్ట్ చేసారు. ఒమన్ సుల్తాన్ మూడు రోజులపాటు భారత్ లో పర్యటించనున్నారు.డిసెంబర్ 16న రాష్ట్రపతి భవన్‌లో ప్రధాని మోడీ మరియు ప్రెసిడెంట్ ముర్ములను సుల్తాన్ అధికారికంగా భేటీ కానున్నారు. అనంతరం నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడరన్ ఆర్ట్‌ను కూడా సందర్శించి, హైదరాబాద్ హౌస్‌లో ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్‌లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







