వచ్చే నెలలో టీజర్‌తో పాటు ఫస్ట్‌లుక్ రిలీజ్
- May 28, 2016
'వూపిరి'..'బాహుబలి' చిత్రాలతో భారీ విజయాలందుకున్న మిల్కీ బ్యూటీ తమన్నా 'అభినేత్రి'గా అలరించేందుకు సిద్ధమవుతోంది. ఈ త్రిభాషా చిత్రంతో తొలిసారి ఫిమేల్ ఓరియెంటెడ్ కథతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం అభినే'త్రీ'కి బాగా కలిసిరావచ్చని సినీ వర్గాలు అనుకుంటున్నాయి.ప్రభుదేవా కీలకపాత్రలో కనిపించనున్న ఈ చిత్రానికి ఏఎల్ విజయ్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే.. టైటిల్‌కు బాగా కనెక్ట్ అయిపోయారేమో గానీ దానికి తగ్గట్టే ఓ సెంటిమెంట్‌ని ఫాలో అవుతున్నారట చిత్ర దర్శకుడు. తెలుగు.. తమిళం.. హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ముగ్గురు నిర్మాతలు కాగా తాజాగా సంగీత దర్శకులను కూడా భాషకు ఒకరు చొప్పున ముగ్గురితో పనిచేయాలని దర్శకుడు ఆలోచనలో ఉన్నాడని సమాచారం. ఈ మేరకు చర్చలు కూడా కార్యక్రమాలు పూర్తయ్యాయని సమాచారం.వచ్చే నెలలో టీజర్‌తో పాటు ఫస్ట్‌లుక్ రిలీజ్‌ని ప్లాన్ చేసిన దర్శక నిర్మాతలు ఈ చిత్రంతో మిల్కీ బ్యూటీ అందాలతో అలరించే ప్రయత్నం చేయనున్నారు.
తాజా వార్తలు
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!







