ముంబై - దోహా మధ్య నాన్-స్టాప్ ఫ్లైట్: విస్తారా
- December 17, 2023
గురుగ్రామ్: టాటా గ్రూప్ - సింగపూర్ ఎయిర్‌లైన్స్ మధ్య జాయింట్ వెంచర్ విస్తారా.. ముంబై -దోహా మధ్య వారానికి నాలుగు డైరెక్ట్ విమాన సర్వీసులను ప్రారంభించినట్లు ప్రకటించింది. విస్తారా A321నియో ఎయిర్‌క్రాఫ్ట్‌లో నడిచే ప్రారంభ విమానం, ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి డిసెంబర్ 15న 18:45 గంటలకు (IST) బయలుదేరి 20:30 గంటలకు (స్థానిక సమయం) దోహాలోని హమద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. ఇండియా-మధ్యప్రాచ్యం మధ్య ప్రయాణానికి డిమాండ్‌లో స్థిరమైన పెరుగుదలతో విస్తారా ఈ ప్రాంతంలో తన ఉనికిని విస్తరించుకోవడంపై దృష్టి సారించినట్లు విస్తారా వెల్లడించింది. ఎయిర్‌లైన్ ఇప్పటికే ఈ ప్రాంతంలోని అబుదాబి, దమ్మామ్, దుబాయ్, జెడ్డా మరియు మస్కట్ గమ్యస్థానాలకు నేరుగా కనెక్టివిటీని అందిస్తుందని విస్తారా సీఈఓ వినోద్ కణ్ణన్ తెలిపారు.
తాజా వార్తలు
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు
- హైదరాబాద్ నగరవాసులకు తీపి కబురు..
- ఇరాన్ చమురు వాణిజ్యంపై భారత్‌తో సంబంధం ఉన్నకంపెనీల పై ట్రంప్ ఆంక్షలు
- కువైట్‌లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్‌లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!







