ఆందోళనకారుల దాడిలో పోలీసులకు గాయాలు

- May 28, 2016 , by Maagulf
ఆందోళనకారుల దాడిలో పోలీసులకు గాయాలు



ఆందోళనకారులు జరిపిన దాడిలో ఇద్దరు బహ్రెయినీ పోలీసులు గాయపడ్డారని ఇంటీరియర్‌ మినిస్ట్రీ ఓ ప్రకటనలో పేర్కొంది. బిలాద్‌ అల్‌ కాదిమ్‌లో ఆందోళనలు జరగ్గా, ఆందోళనకారుల్ని నిలువరించేందుకు పోలీసులు ప్రయత్నించారనీ, ఈ క్రమంలో తలెత్తిన ఉద్రిక్త పరిస్థితుల్లో ఇద్దరు పోలీసులు గాయపడ్డారని ఆ ప్రకటనలో ఇంటీరియర్‌ మినిస్ట్రీ వెల్లడించింది. షియాతీ అపోజిషన్‌ చీఫ్‌ షేక్‌ అలి సల్మాన్‌ సొంత ప్రాంతం బిలాద్‌ అల్‌ కాదిమ్‌. షేక్‌ అలి సల్మాన్‌ ఐదేళ్ళ జైలు శిక్ష అనుభవిస్తున్నారు, తన విపరీత ప్రవర్తన కారణంగా. బహ్రెయిన్‌ న్యాయస్థానం గురువారం, 19 షియాతీలకు పోలీసులపై దాడి చేసిన కేసులో శిక్ష విధించింది. వీరిలో ఐదుగురికి యావజ్జీ కారాగార శిక్ష పడింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com