మొటిమలు వేధిస్తున్నాయా.?
- December 18, 2023తేనే ఆరోగ్యానికి మాత్రమే కాదు, అందానికీ మెరుగునిస్తుంది. ముఖ్యంగా మొటిమలతో ఇబ్బంది పడే యువతకు తేనె ప్రకృతి ప్రసాదించిన వరంగానే పరిగణించాలి.
తేనెలో ఏడు రకాల అమైనో ఆమ్లాలూ, 10 రకాల ఖనిజాలు, విటమిన్ సి, బి.. అలాగే నేచురల్ ఎంజైమ్స్ వుంటాయ్. ఇవి చర్మానికి ఎంతో మేలు చేస్తాయ్.
అలాగే, యాంటి యాక్సిడెంట్గానూ తేనెలోని యాంటీ మైక్రోబయల్స్ పని చేయడంతో మొటిమలు వాటి తాలూకు గుంతలు తగ్గించడంలో తేనె మంచి ఉపయోగకారిగా పని చేస్తుంది.
అందుకోసం కొన్ని రకాల ఇంగ్రీడియంట్స్‌తో కలిపి తేనెను ముఖానికి ఫేస్ ప్యాక్‌లా వాడాల్సి వుంటుంది.
కొంచెం ఓపిక చేసుకుని ఈ రెమిడీస్ పాటిస్తే.. చర్మం తాజాగా మెరిసిపోవడంతో పాటూ, మొటిమల సమస్య నుంచి చర్మాన్ని కాపాడుతుంది.
బొప్పాయి గుజ్జులో కాసింత తేనె కలిపి ముఖానికి పట్టించి, 20 నిమిషాల తర్వాత కడిగేస్తే మొటిమలు, వాటి వల్ల ఏర్పడిన మచ్చలు మానిపోతాయ్.
తేనెను నిమ్మరసంతో కలిపి అప్లై చేయడం వల్ల కూడా మంచి ఫలితం వుంటుంది. డైరెక్ట్‌గా మొటిమలపై తేనె పూసినా వాటి తాలూకు నొప్పిని తగ్గించడంతో పాటూ, మొటిమల సమస్యనూ నివారిస్తుంది. తరచూ ఇలా చేయడం వల్ల కొద్ది రోజుల్లోనే మొటిమల సమస్య మాయమైపోతుంది.
తాజా వార్తలు
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్‌లు
- శుభవార్త. కొత్తగా 10 ఏళ్ల బ్లూ రెసిడెన్సీ వీసా
- అరబ్ సమ్మిట్. గాజా సంక్షోభం, పాలస్తీనా గుర్తింపుపై ఫోకస్..!
- PACI సందర్శకులకు శుభవార్త..!
- ఒమన్ పీస్ బిల్డర్.. UN సెక్రటరీ జనరల్ ప్రశంసలు
- అనుమతి లేకుండా హజ్.. SR100,000 వరకు ఫైన్..!
- 'దుబాయ్ అన్లాక్డ్' క్లెయిమ్‌లను కొట్టిపారేసిన యూఏఈ..!
- సింగపూర్ కొత్త ప్రధానిగా లారెన్స్ వాంగ్
- టీమిండియా కోచ్ రేసులో ఇద్దరు విదేశీయులు..
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్‌లైన్స్