ఐపీఎల్ 2024 మినీ వేలంలో చరిత్ర సృష్టించిన పాట్ కమిన్స్..
- December 19, 2023
దుబాయ్: దుబాయ్ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ వేలంలో ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ చరిత్ర సృష్టించాడు. లీగ్ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడైన ఆటగాడిగా రికార్డులకు ఎక్కాడు. రూ.2 కోట్ల బేస్‌ప్రైజ్‌తో వేలంలోకి వచ్చిన అతడి కోసం ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి. ధర పెరిగిపోవడంతో మిగిలిన ఫ్రాంచైజీలు పక్కకు తప్పుకున్నాయి.
అయినప్పటికీ ఈ ఆసీస్ కెప్టెన్ ను దక్కించుకునేందుకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ నువ్వా నేనా అన్నట్లుగా ధరను పెంచుకుంటూ పోయాయి. చివరకు సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ.20.50కోట్లకు కమిన్స్‌ను దక్కించుకుంది. ఐపీఎల్ చరిత్రలోనే ఇదే అత్యధిక ధర కావడం గమనార్హం.
కాగా.. 2018 ఐపీఎల్ వేలంలో ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ సామ్‌కరన్‌ను పంజాబ్ కింగ్ రూ.18.50 కోట్లకు పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ రికార్డును కమిన్స్ బద్దలు కొట్టాడు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







