153 యూఏఈ యజమానులకు dh50,000 వరకు ఫైన్

- December 22, 2023 , by Maagulf
153 యూఏఈ యజమానులకు dh50,000 వరకు ఫైన్

యూఏఈ: తమ గృహ కార్మికులు ఇతరుల కోసం పని చేయడానికి అనుమతించిన 153 మంది యజమానులకు Dh50,000 వరకు జరిమానా విధించినట్లు అధికారులు గురువారం తెలిపారు. ఉల్లంఘనపై ఈ యజమానుల ఫైళ్లను కూడా బ్లాక్ చేసినట్లు మానవ వనరులు మరియు ఎమిరేటైజేషన్ మంత్రిత్వ శాఖ (మోహ్రే) తెలిపింది. గత రెండు నెలలుగా అధికారులు యూఏఈ వ్యాప్తంగా జరిపిన తనిఖీల్లో ఈ ఉల్లంఘనలను గుర్తించినట్లు పేర్కొన్నారు. పట్టుబడ్డ యజమానులు కొత్త గృహ కార్మికుల పర్మిట్‌ల కోసం దరఖాస్తు చేయలేరని, వారి కేసు పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు సూచించబడుతుందని తెలిపింది. 2022లో జారీ చేయబడిన ఫెడరల్ డిక్రీ చట్టం ప్రకారం, గృహ కార్మికులు అనుమతులు లేకుండా పని చేయడానికి అనుమతించరు. 600590000కి డయల్ చేయడం ద్వారా చట్టవిరుద్ధమైన పద్ధతులు లేదా డొమెస్టిక్ వర్కర్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీలకు సంబంధించి ఏదైనా సమాచారాన్ని తెలపాలని కోరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com