వైఎస్ జగన్ కి 'ఆటా' మహాసభలకు పిలుపు
- May 28, 2016
వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని 'ఆటా' మహాసభల్లో పాల్గొనడానికి అమెరికాకు రావాల్సిందిగా అక్కడ నివసించే తెలుగువారు ఆహ్వానించారు. 'ఆటా' ప్రెసిడెంట్ ఎలెక్ట్ ఎ.సి.కరుణాకర్‌రెడ్డి, కోఆర్డినేటర్ దగ్గుమాటి కోటిరెడ్డి శనివారం ఉదయం జగన్‌ను ఆయన నివాసంలో కలుసుకుని ఈ మేరకు ఆహ్వానం అందజేశారు. 'ఆటా' మహాసభలు జూలై 1, 2,3 తేదీల్లో చికాగోలో జరుగుతాయని వారు జగన్‌కు వివరించారు. జగన్ ఈ ఆహ్వానాన్ని మన్నిస్తూ పార్టీ తరపున ఒక ప్రతినిధి బృందాన్ని సభలకు పంపుతామని చెప్పినట్లు 'ఆటా' ప్రతినిధులు తెలిపారు. ఆహ్వానం అందిస్తున్న సమయంలో పార్టీ ముఖ్యనేతలు బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నారు.
తాజా వార్తలు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!
- సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!
- మానవ అక్రమ రవాణా నిరోధంలో ఒమన్ కీలక చర్యలు..!!
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..







