ఆర్థిక రంగాల్లో ఉమ్మడి సహకారంపై ఒమన్, సౌదీ చర్చలు

- December 23, 2023 , by Maagulf
ఆర్థిక రంగాల్లో ఉమ్మడి సహకారంపై ఒమన్, సౌదీ చర్చలు

మస్కట్: సౌదీ అరేబియా ఆర్థిక, ప్రణాళికా శాఖ మంత్రి ఫైసల్ ఫాదిల్ అలీబ్రహీం మరియు అతనితో పాటు వచ్చిన ప్రతినిధి బృందంతో ఒమన్ ఆర్థిక మంత్రి డాక్టర్ సైద్ మహమ్మద్ అల్ సఖ్రి చర్చలు జరిపారు. ఈ సమావేశంలో వివిధ ఆర్థిక రంగాల్లో ఉమ్మడి సహకారాన్ని పెంపొందించుకునే మార్గాలపై ఇరుపక్షాలు చర్చించారు. ఆర్థిక వ్యవస్థ మరియు ప్రణాళిక రంగంలో పరస్పర అవగాహన ఒప్పందం (MOU) ప్రాజెక్ట్‌కు సంబంధించిన విషయాలపై  కూడా వారు సమీక్షించారు. ఇంకా, ఇద్దరు మంత్రులు ఒమన్ విజన్ 2040 మరియు సౌదీ విజన్ 2030 లక్ష్యాలపై దృష్టి సారించారు. అంతేకాకుండా, ఈ సమావేశానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ నాసర్ రషీద్ అల్ మావాలి, మంత్రిత్వ శాఖకు చెందిన పలువురు అధికారులు హాజరయ్యారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com