పలు నగరాల నుంచి అయోధ్యకు విమాన సర్వీసులు
- December 23, 2023
అయోధ్య: అయోధ్యలోని మర్యాద పురుషోత్తం శ్రీ రామ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి దేశంలోని పలు ప్రధాన నగరాలకు జనవరి 6వతేదీ నుంచి విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి.
డిసెంబర్ 30వతేదీన ప్రధాని నరేంద్ర మోదీ ఈ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్నారు. అయోధ్య ఎయిర్‌పోర్ట్‌లో డిసెంబర్ 22వతేదీన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఎయిర్‌బస్ ఎ 320 ఇటీవలే విజయవంతంగా ల్యాండింగ్ చేయడంతో అయోధ్య నగరానికి కొత్త శకానికి నాంది పలికినట్లయింది.
వచ్చే ఏడాది రామ మందిరాన్ని ఘనంగా ప్రారంభించే సమయానికి అయోధ్య విమాన ప్రయాణానికి కేంద్రంగా మారింది. ఎయిర్‌లైన్స్ కంపెనీ ఇండిగో ఢిల్లీ, అహ్మదాబాద్, ముంబయి, కోల్‌కతా, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, గోవా వంటి ప్రధాన నగరాల నుంచి విమానాలు రాకపోకలు సాగించనున్నాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 821 ఎకరాల భూమిని అందించిన తర్వాత, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కొత్త విమానాశ్రయాన్ని యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి చేయడానికి కృషి చేస్తోంది.
డిసెంబర్ 15 నాటికి కొత్త విమానాశ్రయం సిద్ధంగా ఉంటుందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. అయోధ్య విమానాశ్రయం నగరం చారిత్రక ప్రాముఖ్యత, సంస్కృతిని ప్రతిబింబించేలా చేయాలని పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. అమోధ్య విమానాశ్రయం 6500 చదరపు మీటర్ల విమానాశ్రయం. గంటలో రెండు నుంచి మూడు విమానాలను ల్యాండ్ చేయగలదని,2200 మీటర్ల రన్‌వే రెండవ దశలో 3700 మీటర్లకు పొడిగించనున్నట్లు సింధియా చెప్పారు.
తాజా వార్తలు
- ఇరాన్ చమురు వాణిజ్యంపై భారత్‌తో సంబంధం ఉన్నకంపెనీల పై ట్రంప్ ఆంక్షలు
- కువైట్‌లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్‌లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్‌లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..







