పలు నగరాల నుంచి అయోధ్యకు విమాన సర్వీసులు

- December 23, 2023 , by Maagulf
పలు నగరాల నుంచి అయోధ్యకు విమాన సర్వీసులు

అయోధ్య: అయోధ్యలోని మర్యాద పురుషోత్తం శ్రీ రామ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి దేశంలోని పలు ప్రధాన నగరాలకు జనవరి 6వతేదీ నుంచి విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి.

డిసెంబర్ 30వతేదీన ప్రధాని నరేంద్ర మోదీ ఈ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్నారు. అయోధ్య ఎయిర్‌పోర్ట్‌లో డిసెంబర్ 22వతేదీన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఎయిర్‌బస్ ఎ 320 ఇటీవలే విజయవంతంగా ల్యాండింగ్ చేయడంతో అయోధ్య నగరానికి కొత్త శకానికి నాంది పలికినట్లయింది.

వచ్చే ఏడాది రామ మందిరాన్ని ఘనంగా ప్రారంభించే సమయానికి అయోధ్య విమాన ప్రయాణానికి కేంద్రంగా మారింది. ఎయిర్‌లైన్స్ కంపెనీ ఇండిగో ఢిల్లీ, అహ్మదాబాద్, ముంబయి, కోల్‌కతా, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, గోవా వంటి ప్రధాన నగరాల నుంచి విమానాలు రాకపోకలు సాగించనున్నాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 821 ఎకరాల భూమిని అందించిన తర్వాత, ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కొత్త విమానాశ్రయాన్ని యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి చేయడానికి కృషి చేస్తోంది.

డిసెంబర్ 15 నాటికి కొత్త విమానాశ్రయం సిద్ధంగా ఉంటుందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. అయోధ్య విమానాశ్రయం నగరం చారిత్రక ప్రాముఖ్యత, సంస్కృతిని ప్రతిబింబించేలా చేయాలని పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. అమోధ్య విమానాశ్రయం 6500 చదరపు మీటర్ల విమానాశ్రయం. గంటలో రెండు నుంచి మూడు విమానాలను ల్యాండ్ చేయగలదని,2200 మీటర్ల రన్‌వే రెండవ దశలో 3700 మీటర్లకు పొడిగించనున్నట్లు సింధియా చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com