దుబాయ్ లో క్రిస్మస్. శాంతా క్లాజ్ చీర్స్ డ్రైవ్

- December 23, 2023 , by Maagulf
దుబాయ్ లో క్రిస్మస్. శాంతా క్లాజ్ చీర్స్ డ్రైవ్

దుబాయ్: ఈ క్రిస్మస్ సందర్భంగా శాంతా క్లాజ్ లు దుబాయ్ మరియు అబుదాబిలలో చీర్స్ డ్రైవ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా దారి పొడవునా స్వీట్స్, చాక్లెట్‌ల అదనపు బహుమతులు అందజేస్తూ ఉల్లాసంగా కనిపిస్తున్నారు. దుబాయ్‌కి చెందిన స్టార్ట్-అప్ కంపెనీ Zofeur క్రిస్మస్ రోజు వరకు రైడ్‌ల కోసం తమ కార్లను అందజేస్తుంది. శాంటా డ్రైవర్‌లలో ఒకరైన ఉగాండా ప్రవాస రోనాల్డ్ అసబా మాట్లాడుతూ.. ఈ క్రిస్మస్‌లో చిరస్మరణీయమైన అనుభవాలను సృష్టించడమే తన లక్ష్యం అని అన్నారు. క్రిస్మస్ సందర్భంగా తమ కస్టమర్‌లు మరియు ప్రయాణీకుల కోసం మరపురాని క్షణాలను సృష్టించాలని తాము ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.     ఉగాండాకు చెందిన మరో శాంటా డ్రైవర్ జెంబా రోనాల్డ్ మాట్లాడుతూ.. “కస్టమర్‌లు ఈ కాన్సెప్ట్‌ను ఇష్టపడుతున్నారు. ఎందుకంటే ఇది వారికి ఆశ్చర్యం కలిగిస్తుంది. మాతో సెల్ఫీలు దిగడం, వాటిని తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరుగుతోంది. డ్రైవ్ చేస్తున్నప్పుడు మేము వారికి స్వీట్లు మరియు క్యాండీలను స్నాక్స్‌గా అందిస్తాము," అని అతను పేర్కొన్నాడు. శాంటా డ్రైవర్‌లు ప్రతి ఒక్కరి భద్రత గురించి కూడా ఈ సందర్భంగా అవగాహన కల్పిస్తున్నారు.

శాంటా సేవలు

Zofeur అనేది iOS మరియు Play Storeలో డౌన్‌లోడ్ చేసుకోగలిగే ఆన్-డిమాండ్ పే-పర్-నిమిట్ డ్రైవర్ సేవల ప్లాట్‌ఫారమ్. కాగా, పండుగ కాలంలో జాప్యాన్ని నివారించడానికి డ్రైవర్‌లను ముందుగా బుక్ చేసుకోవాలని సూచించారు. ఎందుకంటే మొత్తం జోఫర్ డ్రైవర్‌లలో ఐదు శాతం మంది మాత్రమే శాంటా సేవలను అందిస్తారు. శాంటా డ్రైవర్లు దుబాయ్ మరియు అబుదాబి మధ్య వన్-వే ట్రిప్‌లకు కూడా వెళ్లవచ్చు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com