ఎన్నారై యశస్వి బొద్దులూరి అరెస్టు

- December 23, 2023 , by Maagulf
ఎన్నారై యశస్వి బొద్దులూరి అరెస్టు

హైదరాబాద్: అమెరికాలో సాఫ్టువేరు ఇంజనీరుగా వృత్తి బాధ్యతలు నిర్వహిస్తూ, భార్యాపిల్లలతో నివసిస్తున్న యష్, అనారోగ్యంతో ఉన్న తన తల్లిని పరామర్శించడానికి ఈ రోజు హైదరాబాద్ విమానాశ్రయంలో దిగగానే, జగన్ రెడ్డి నియంత ప్రభుత్వం పొంచి ఉండి అరెస్ట్ చేసి మంగళగిరి డిజిపి ఆఫీసుకు తరలిస్తున్నది. 

ప్రవాసంలో ఉండి  కూడా, రాష్ట్రం పట్ల బాధ్యతగల పౌరుడిగా, నిత్యం రాష్ట్రంలో జరిగే పరిణామాలమీద తన అభిప్రాయాల్ని సోషల్ మీడియాలో నిర్భయంగా వెలిబుచ్చే యష్ పైన వైసిపి ప్రభుత్వం కక్షగట్టింది. నిరంతరం ఇండియాలో ఉన్న అతని కుటుంబసభ్యుల్ని వేధిస్తోంది. ఇంతకు మునుపు కూడా వైసిపి కార్యకర్తలు అతని ఇంటి మీద దాడి చేసి కుటుంబాన్ని భయభ్రాంతుల్ని చేశారు. 

ఒక ఎన్నారై స్వేచ్ఛగా తన అభిప్రాయాల్ని వెల్లడించే హక్కుని కాలరాసి, అదేదో రాజద్రోహ నేరంలాగా ఎయిర్పోర్టులో దిగగానే అరెస్ట్ చేయాలనే దుర్బుద్ధితో పన్నాగం వేయడం జగన్ ప్రభుత్వ దుర్మార్గాన్ని సూచిస్తోంది. ఇటువంటి అప్రజాస్వామిక నిర్బంధాన్ని అమెరికా టీడీపీ ఎన్నారై నేత జయరాం కోమటి తీవ్రంగా ఖండించారు. యష్ భద్రత పట్ల ఈ ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించి, వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసారు.

--రమ్య సాగర్ కర్రీ(మాగల్ఫ్ ప్రతినిధి,ఆంధ్ర ప్రదేశ్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com