TSRTC ఎండీ సజ్జనార్ మహిళా ప్రయాణికులకు విజ్ఞప్తి
- December 23, 2023
హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మీ పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించిన విషయం తెలిసిందే. గుర్తింపు కార్డులను చూపించి మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మహిళా ప్రయాణికులకు విజ్ఞప్తి చేశారు. ఎక్స్ ప్రెస్ బస్సుల్లో తక్కువ దూరం ప్రయాణించే మహిళలు ఎక్కువగా వెళ్తున్నట్లు టీఎస్ఆర్టీసీ యాజమాన్యం దృష్టికి వచ్చిందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు.
దీని వల్ల దూర ప్రాంత ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోందన్నారు. తక్కువ దూరం ప్రయాణించే వారు పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణించి, సిబ్బందికి సహకరించాలని కోరారు. అలాగే, కొందరు మహిళలు అనుమతించిన స్టేజీల్లో కాకుండా మధ్యలోనే బస్సులను ఆపాలని సిబ్బందిపై ఒత్తిడి తెస్తున్నారని తెలిపారు.
దీంతో ప్రయాణ సమయం పెరుగుతోందన్నారు. ఇక నుంచి ఎక్స్ ప్రెస్ బస్సులను అనుమతించిన స్టేజీల్లోనే ఆపడం జరుగుతుందని పేర్కొన్నారు. దూర ప్రాంత ప్రయాణికులకు ప్రాధాన్యత ఇచ్చి సిబ్బందికి సహకరించాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం విజ్ఞప్తి చేస్తోందన్నారు.
తాజా వార్తలు
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం