తెలంగాణ ఏసీబీ డీజీగా సీవీ ఆనంద్ బాధ్యతలు
- December 24, 2023
హైదరాబాద్: తెలంగాణ ఏసీబీ డీజీగా ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ బాధ్యతలు స్వీకరించారు. రెండేళ్లపాటు హైదరాబాద్ సీపీగా పని చేసిన ఆయనను కాంగ్రెస్ ప్రభుత్వం ఏసీబీ డీజీగా నియమించింది. ఈ నేపథ్యంలో ఆయన ఈ రోజు బాధ్యతలను స్వీకరించారు. ఆయనకు ఏసీబీ కార్యాలయ సిబ్బంది, ఇతర ఉద్యోగులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సీవీ ఆనంద్ ట్వీట్ చేశారు.
రెండేళ్లపాటు హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా తాను కొనసాగానని ఆయన పేర్కొన్నారు.
శాంతిభద్రతలను పటిష్ఠంగా ఉంచానని పేర్కొన్నారు. అది తనకు వృత్తిపరంగా చాలా సంతృప్తిని ఇచ్చిందన్నారు. ఒకేసారి అన్ని రకాల పండుగలు వచ్చినప్పటికీ… ఎక్కడా మతసామరస్యం దెబ్బతినకుండా ప్రశాంతంగా పండుగలను నిర్వహించినట్లు తెలిపారు. సైబర్ క్రైమ్‌లో గతంలో ఎన్నడూ చూడని నేరాలను చూసినట్లు తెలిపారు. ఇక ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఉండేందుకు చర్యలు తీసుకున్నామన్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?