అబుదాబి న్యాయసహాయ శిబిరం లో పాల్గొన్న 'గల్ఫ్' సినీ దర్శకులు సునీల్ కుమార్ రెడ్డి

- June 28, 2015 , by Maagulf
అబుదాబి న్యాయసహాయ శిబిరం లో పాల్గొన్న 'గల్ఫ్' సినీ దర్శకులు సునీల్ కుమార్ రెడ్డి

 

అబుదాబి లోని కేరళ సోషల్ సెంటర్ హాల్ లో 27న శుక్రవారం సాయంత్రం 5 గం. లకు 'ఉచిత న్యాయ సహాయ శిబిరం' ను మైగ్రెంట్ ఫోరం ఇన్ ఆసియా మరియు సెంటర్ ఫర్ ఇండియన్ మైగ్రెంట్ స్టడీస్ సంస్థల  ఆధ్వర్యంలో భారత రాయభారి చే ప్రారంభింపబడినది.ఈ కార్యక్రమము లో ప్రవాస భారతీయులు తమ సమస్యలను న్యాయ సహాయ నిపుణులకు తెలియ పరుచుకున్నారు.న్యాయ నిపుణులు సలహాలు సూచనులు అందించారు.ఈ కార్యక్రమము వలన సినీ దర్శకులు సునీల్ కుమార్ రెడ్డి గారికి ఇక్కడి ప్రవాస భారతీయుల సమస్యలు తెలిసాయి.కార్యనిర్వాహక సభ్యులు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసారు. 

 

మన తెలుగు రాష్ట్రాల నుండి ఈ కార్యక్రమములో సినీ దర్శకులు సునీల్ కుమార్ రెడ్డి,చిత్తర్వు శ్రీకాంత్,జనగామ శ్రీనివాస్,టి.రాధా కిషన్,దుబ్బుల తిరుపతి,జయ రెడ్డి,రాజ్ కుమార్,సంపత్ తదితరులు పాల్గొన్నారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించటం వలన ప్రవాస భారతీయులకు మేలు జరుగుతుందని ఆశిస్తున్నాము.


--సి.శ్రీ(దుబాయ్) 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com