టాకీ పని పూర్తి చేసుకున్న డా.గజల్ "అనుష్టానం"
- June 28, 2015
లలితశ్రీ మూవీస్ పతాకంపై శ్రీ MP రవిరాజ్ రెడ్డి నిర్మాతగా వట్లూరి జయ ప్రకాష్ నారాయణ సహ నిర్మాతగా డా. గజల్ శ్రీనివాస్, మాధవిలత జంటగా నటిస్తున్న అనుష్టానం టాకీ పార్టు పూర్తయిందని దర్శకుడు కృష్ణ వాసా తెలిపారు.
ఇటీవల సారధి స్టుడియోలో నాయకి నాయకులతో యుగళ గీతాన్ని, పతాక సన్నివేశాన్ని ఎంతో హృద్యంగా చిత్రీకరించినట్లు తెలిపారు. భార్య, భర్తల మధ్య ఉండే అనుభందాలను, కొన్ని సున్నితమైన అంశాలను ఈ చిత్రంలో ప్రధాన అంశాలుగా ఉంటాయని, 1950 లో శ్రీ గుడిపాటి వెంకటచలం గారు రాసిన ఒక కథ స్పూర్తితో ఈ చిత్రాన్ని రూపకల్పన చేసినట్లు తెలిపారు. డా. గజల్ శ్రీనివాస్, మాధవిలత పెర్ఫార్మెన్స్ హైలెట్ గా నిలుస్తుందని, సీనియర్ నటి జయలలిత, మలయాళ నటుడు శ్రీ డిసౌజా, రాగిణి, సాయి శర్మ, శ్రీనివాస రెడ్డి, కృష్ణ కిషోర్ లు ఈ చిత్రంలో నటించారని తెలిపారు.
ఈ చిత్రానికి కెమెరామెన్ గా వెంకట హనుమ, ఎడిటింగ్ ఆంజనేయులు, స్క్రీన్ ప్లే, సంగీతం, దర్సకత్వం కృష్ణ వాసా అని, ఈ జూలై నెలలో ఎడిటింగ్, రీరికార్డింగ్ పూర్తి చేసుకుని సెప్టెంబర్ మొదటి వారంలో ఈ సినిమా విడుదలకు ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







